సల్మాన్ సూపర్! | salman is super! | Sakshi
Sakshi News home page

సల్మాన్ సూపర్!

Published Wed, Jan 21 2015 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

సల్మాన్ సూపర్!

సల్మాన్ సూపర్!

బహుశా హీరోయిన్‌గా ఎదగాలంటే ఈ కళ అబ్బాలేమో!... అదే... ఏ హీరోతో చేస్తే ఆ హీరోను ఆకాశానికెత్తేయడం! స్టార్‌డమ్ వచ్చి ఇండస్ట్రీలో కాస్త స్థిరపడే వరకూ ఇలాంటివి తప్పవేమో! లేటెస్ట్‌గా అనిల్‌కపూర్ గారాల పట్టి సోనమ్‌కపూర్ కూడా ఇదే బాట పట్టింది. ఈ అమ్మడు కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌తో ఓ సినిమా చేస్తోంది. ‘సల్మాన్‌ను అందరూ ఓ బిగ్ స్టార్‌గానే చూస్తారు.

 కానీ ఆయనలో ఓ అద్భుతమైన నటుడు కూడా ఉన్నాడని గుర్తించాలి. ఆయనతో కలసి పనిచేస్తే మనలోని నటుడు కూడా ఓ మెట్టు పైకి ఎదుగుతాడు’ అంటూ చెప్పుకొచ్చింది సోనమ్. పిల్లలకు తండ్రులైన హీరోలతోనే ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయాల్సి వస్తోందంటూ ముసిముసిగా నవ్వుతూనే వాపోయిందీ చిన్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement