స్కూల్ బస్ ఢీకొనడంతో వ్యక్తి మరణించిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
స్కూల్ బస్ ఢీకొనడంతో వ్యక్తి మరణించిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..వెంకన్న(49) ప్రై వేటు ఉద్యోగి. కేపీహెచ్‌బీ ఫోర్త్ ఫేజ్‌లో నివాసం ఉంటున్నాడు. ఐటీ పార్కు నుండి కేపీహెచ్‌పీ వెళ్తుండగా జేఎన్‌టీయూ రోడ్డులో చిరెక్ స్కూల్ బస్సు (ఏపీ 28 టీఈ 0255) ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.