హైదరాబాద్: ఫీజు చెల్లించలేదని విద్యార్థులను స్కూల్ యాజమాన్యం నిర్బంధించింది. ఆ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని... ఆందోళన చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్ అల్విన్ కాలనీలోని తులసీనగర్లో ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి... విద్యార్థుల తల్లిదండ్రులను శాంతింప చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులోభాగంగా స్కూల్ యాజమానులను పోలీసులు మాట్లాడుతున్నారు.