రాజ్‌నాథ్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న పంజగుట్ట ఇన్‌స్పెక్టర్ రవీందర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్ కమిషనరేట్‌లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ అవార్డు దక్కించుకుంది. కేంద్ర హోంశాఖ, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్లపై సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా వందకు పైగా స్టేషన్లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, దర్యాప్తు.. ఇలా 140 ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో పది పోలీస్ స్టేషన్లతో తుది జాబితా రూపొందించి వాటిలోంచి మూడు ఉత్తమ స్టేషన్లను ఎంపిక చేశారు.
తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కమిషనరేట్ పరిధిలోని గుడుంబా పోలీస్ స్టేషన్ మూడో స్థానంలో నిలిచాయి. శనివారం మధ్యప్రదేశ్ టెకన్‌పూర్‌లోని బీఎస్‌ఎఫ్ క్యాంపులో ప్రారంభమైన ఆలిండియా డీజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ పోలీస్ స్టేషన్లకు ట్రోఫీలను అందజేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంజగుట్ట ఇన్‌స్పెక్టర్ రవీందర్ అవార్డును స్వీకరించారు. టెక్నాలజీ, స్మార్ట్ పోలీసింగ్‌లో తెలంగాణ దూసుకెళ్తోందని రాజ్‌నాథ్‌సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment