సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ | SI notification released in telangana | Sakshi
Sakshi News home page

సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్

Published Sun, Feb 7 2016 1:13 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ - Sakshi

సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్

  • ఎనిమిది విభాగాల్లో 539 ఖాళీల భర్తీకి జారీ
  • సివిల్, ఏఆర్, ఫైర్ సర్వీసులలో జోన్ల వారీగా నియామకాలు
  • జోన్-5 కింద 100 పోస్టులు, జోన్-6 కింద 188 పోస్టులు
  • మిగతా పోస్టులకు రాష్ట్రస్థాయిలో నియామకాలు
  • ఈనెల 10 నుంచి మార్చి 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
  • ఏప్రిల్ 17న ప్రిలిమినరీ పరీక్ష.. అనంతరం శరీర దారుఢ్య పరీక్షలు
  • అన్ని కేటగిరీల్లోనూ మూడేళ్ల వయోపరిమితి సడలింపు
  • మహిళలకు సివిల్‌లో 33 శాతం, ఏఆర్‌లో 10 శాతం రిజర్వేషన్లు
  •  
    సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సై పోస్టుల భర్తీకి నగారా మోగింది. 539 సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) ఖాళీల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవలే 9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా... తాజాగా ఎస్సై పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 539 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకాగా.. అందులో సివిల్ విభాగంలో 208 పోస్టులు, ఏఆర్‌లో 74, స్పెషల్ ఆర్ముడ్‌లో 02, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ)లో 205, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 12, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ 09, కమ్యూనికేషన్ విభాగంలో 23, పోలీస్ ట్రాన్స్‌ఫోర్టు ఆఫీసర్స్ 06 పోస్టులు ఉన్నాయి.
     
    వీటిలో సివిల్, ఏఆర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ పోస్టులను జోన్ల వారీగా, మిగతా పోస్టులను రాష్ట్రస్థాయిలో భర్తీ చేస్తారు. జోన్ల వారీగా భర్తీ చేసే పోస్టుల్లో ఆయా జోన్‌కు చెందినవారికి 70 శాతం పోస్టులు కేటాయిస్తారు. మిగతా 30 శాతం ఓపెన్ కేటగిరీ కింద రాష్ట్రస్థాయిలో నియామకాలు చేపడతారు.

    ఈ పోస్టులకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 3 అర్ధరాత్రి 12 గంటల వరకు ఠీఠీఠీ.్టటఞటఛ.జీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్‌బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు తెలిపారు. పోస్టు కోడ్ 11, 12, 13, 14, 16, 17 విభాగాల వారికి ఏప్రిల్ 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు... పోస్టు కోడ్ 31, 32 విభాగాల వారికి అదే రోజున మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
     
    మూడేళ్ల వయస్సు సడలింపు
     ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సై పోస్టులకు మూడేళ్లు సడలింపు ఇచ్చారు. దీంతో జనరల్ కేటగిరీ వయోపరిమితి 25 ఏళ్ల నుంచి 28 ఏళ్లకు పెరిగింది. జూలై 1, 2015 నాటికి 28 ఏళ్లు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ వయోపరిమితి జనరల్ కేటగిరీలో 30 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు పెరిగింది.

    ఇక అన్ని విభాగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో అదనపు సడలింపు వర్తిస్తుంది. పరీక్ష ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.500.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250. అభ్యర్థులందరూ పరీక్ష ఫీజును మీసేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లోగానీ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారాగానీ చెల్లించవచ్చు. అనంతరం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
     
     మరికొన్ని ముఖ్యాంశాలు..
    దరఖాస్తులో ఎలాంటి తప్పులు దొర్లినా అందుకు పూర్తిగా అభ్యర్థులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
    ఓసీ, బీసీ అభ్యర్థులు కనీసం డిగ్రీ, లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణత, డిగ్రీ చదువుతున్న వారు అర్హులు.
    దరఖాస్తులో విద్యార్హతకు సంబంధించి ఉన్నత విద్యను మాత్రమే ప్రస్తావించాలి.
    ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత శారీరక దృఢత్వ పరీక్షలకు హాజరయ్యేవారు.. వారి విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను చూపాల్సి ఉంటుంది.
    బీసీ అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షలకు మించకూడదు. స్థానిక తహసీల్దార్ ధ్రువపరిచిన ఆదాయ సర్టిఫికెట్‌ను పొందుపరచాలి.
    రాతపరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో అర్థమెటిక్, మెంటల్  ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు.. పేపర్-2లో జనరల్ స్టడీస్‌కు సంబంధించిన ప్రశ్నలు.. పేపర్-3 ఇంగ్లీషు.. పేపర్-4లో తెలుగు లేదా ఉర్దూకు సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఈ పరీక్షలన్నింటికి సంబంధించిన సిలబస్‌ను పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు త్వరలో వెబ్‌సైట్లో పొందుపరచనుంది.


     వివిధ విభాగాల్లో పోస్టుల వివరాలు..
     విభాగం                        పోస్టులు
     సివిల్ (పురుషులు/మహిళలు)        208
     ఆర్ముడ్ రిజర్వు (పురుషులు/మహిళలు)    74
     స్పెషల్ ఆర్ముడ్ (సి.పి.ఎల్)(పురుషులు)    02
     టీఎస్‌ఎస్‌పీ (ఆర్.ఎస్.ఎస్) (పురుషులు)    205
     స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (పురుషులు)    12
     అగ్నిమాపకశాఖ                    09
     కమ్యూనికేషన్స్ (పురుషులు/మహిళలు)    23
     పీటీవో (పురుషులు)                06
     మొత్తం                         539
     
     
     
     జోన్ల వారీగా భర్తీ చేసే పోస్టుల సంఖ్య
     జోన్            సివిల్        ఆర్ముడు    ఫైర్
     జోన్-5            75        22        3
     జోన్-6            133        52        0
     సిటీఆఫ్ హైదరాబాద్    -    -    3
     మొత్తం            208        74        6
     (ఫైర్‌స్టేషన్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి జోన్-6లో హైదరాబాద్ ఉండదు. అందువల్ల సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరిట ప్రత్యేకంగా నియామకాలు చేపడతారు. దీనిలో మూడు బ్యాక్‌లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు)
     జోన్-5 కిందకు వచ్చే జిల్లాలు (ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం)
     జోన్-6 కిందకు వచ్చే జిల్లాలు (మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్)
     
     
     శరీర దారుఢ్య పరీక్షలు..
    పురుషుల ఎత్తు కనీసం 167.6 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతీ చుట్టుకొలత గాలి పీల్చినప్పుడు 86.3 సెంటీమీటర్లు, వదిలేసినప్పుడు 81.3 సెంటీమీటర్లు ఉండాలి. మహిళల కనీస ఎత్తు 152.5 సెంటీమీటర్లు ఉండాలి. కమ్యూనికేషన్, పీటీవో విభాగాల్లోని పోస్టులకు మాత్రం పురుషుల ఎత్తు 162 సెంటీమీటర్లు, ఛాతీ గాలి పీల్చినప్పుడు 84 సెంటీమీటర్లు, వదిలినప్పుడు 80 సెంటీమీటర్లు ఉండాలి.
     
    అన్ని విభాగాల్లోని ఎస్సై పోస్టులకు మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎస్టీ పురుష అభ్యర్థుల ఎత్తు 160 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతీ చుట్టుకొలత గాలి పీల్చినప్పుడు 80 సెంటీమీటర్లు, వదిలేసినప్పుడు 77 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్టీ మహిళల కనీస ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి.
     
    ఈవెంట్స్            జనరల్            ఎక్స్‌సర్వీస్‌మెన్    మహిళలకు
    100 మీటర్ల పరుగు    15 సెకన్లు            16.5 సెకన్లు        20 సెకన్లు
     లాంగ్‌జంప్        3.80 మీటర్లు        3.65 మీటర్లు    2.5 మీటర్లు
     షాట్‌పుట్ (7.26 కేజీలు)    5.60 మీటర్లు    5.60 మీటర్లు    3.75 మీటర్లు
     హైజంప్            1.20 మీటర్లు        1.05 మీటర్లు    -
     800 మీటర్ల పరుగు    170 సెకన్లు            200 సెకన్లు        -
     (షాట్‌పుట్ బాల్ బరువు పురుషులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 7.26 కేజీలు, మహిళలకు 4 కేజీలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement