తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త | 510 SI posts notification announced by telangana govt | Sakshi
Sakshi News home page

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త

Published Sat, Feb 6 2016 4:34 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త - Sakshi

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త

హైదరాబాద్ : తెలంగాణ  రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో శుభవార్త. ఇప్పటికే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన పోలీస్‌శాఖ తాజాగా సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. పోలీస్ శాఖలోని ఆయా విభాగాలలో ఖాళీగా ఉన్న 510 ఎస్ఐ పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. 

సివిల్, స్పెషల్ పోలీస్, ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక శాఖలో ఎస్‌ఐ, తత్సమాన హోదాలో ఉన్న పలు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిజాస్టర్ ఎస్ఐ-9, సీపీఎల్ అంబర్ పేట ఎస్ఐ-2 పోస్టులు ఉండగా, సివిల్ ఎస్ఐ-208, ఏఆర్ ఎస్ఐ-74, రిజర్వ్ ఎస్ఐ-205, ఎస్పీఎఫ్ ఎస్ఐ-12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ నెల 10 నుంచి మార్చి 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని పేర్కొంది. ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్కు సంబంధించి వివరాలను www.tslprb.in వెబ్సైట్లో పొందవచ్చు.  రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది పోలీస్ విభాగమే. ఇప్పటికే కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement