హెల్మెట్ ‘పెట్టి’ దొరికేశాడు
ఇంటి దొంగను పట్టించిన శిర్రస్త్రాణం
బంజారాహిల్: హెల్మెట్ దొంగను పట్టించింది... చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాకుండా ఉండేందుకు కెమెరాకు హెల్మెట్‌ను అడ్డుగా పెట్టి.. చివరకు తానే పోలీ సులకు అడ్డంగా దొరికిపోయాడు అపోలో ఆసుపత్రి ఉద్యో గి ఒకరు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకా రం... జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అపోలో లైఫ్‌సెంటర్ జనరల్ మేనేజర్ డానియల్ సుమన్ ఎప్పటిలాగే గురువా రం రాత్రి తన గదికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం వచ్చి గదిలోని సీక్రెట్ కోడ్ లాకర్‌ను తెరిచి చూడగా అందులో ఉండాల్సిన రూ.3.25 లక్షల నగ దు, 10 గ్రాముల బంగారు నాణెం కనిపించలేదు. దీంతో లాక ర్ లోని నగదు, నాణెం చోరీ అయ్యాయని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రైం పోలీసులు చోరీ జరిగిన గదిలోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా కెమెరాకు హెల్మెట్ అడ్డుపెట్టిన ట్లు స్పష్టమైంది. ఆ హెల్మెట్‌పై ఉన్న ఓ జో న్ అనే అక్షరాలు సీసీ పుటేజీలో స్పష్టంగా కనిపించాయి. దర్యా ప్తు ప్రారంభించిన పోలీసులు ఆ లాకర్ సీక్రెట్ కోడ్ తెలిసిన ఐదుగురు ఉద్యోగులనూ ప్రశ్నించా రు. వారి హెల్మెట్లను కూడా తెప్పించి పరిశీలించిన పోలీసులు ఎగ్జిక్యూటీవ్‌గా పని చేసే పవన్‌కుమార్ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. అతడిని తమ దైనశైలిలో విచారించగా తానే ఈ చోరీ చేసినట్టు అంగీకరించాడు. దొంగి లించిన డబ్బును అదే రాత్రి తన కార్యాలయం బయట వేచి ఉన్న స్నేహితుడు కమలేశ్‌కు ఇచ్చి పంపేశానని చెప్పాడు. దీంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి, శుక్రవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు.