ఆరుగురు పోకిరీలకు జైలు
సాక్షి, సిటీబ్యూరో: రహదారులపై, మార్కెట్‌లో, సెల్‌ఫోన్ ద్వారా మహిళలు, యువతుల్ని వేధిస్తూ నగర షీ-టీమ్స్‌కు చిక్కిన ఆరుగురు పోకిరీలకు న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా గురువారం తెలిపారు. వీటి లో కొన్ని ఉదంతాల్లో కేసు నమోదుకు బాధితులు వెనుకాడినా పెట్టీ కేసులు నమోదు చేయడంతో పాటు సరైన ఆధారాలతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టామని ఆమె పేర్కొన్నారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముసీయుద్దీన్ ఆన్‌లైన్ వ్యాపార సంస్థకు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఓ మహిళ వస్తువులు డెలివరీ చేస్తున్న సమయంలో ఆమె ఫోన్ నెంబర్ నమోదు చేసుకున్నాడు. ఆపై చాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ తనతో స్నేహం చేయాల్సిందిగా వెంటపడ్డాడు.
బాధితురాలు వాట్సాప్ ద్వారా షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రెండు రోజుల జైలు పడింది. ఆజంపురకు చెందిన కె.నరేంద్ర మద్యం తాగి ఫలక్‌నుమ రైతు బజార్ వద్ద ఓ మహిళ వెంటపడి వేధిస్తున్నాడు. అక్కడే డెకాయ్ ఆపరేషన్‌లో ఉన్న షీ-టీమ్స్ ఈ తతంగాన్ని వీడియో రికార్డింగ్ చేయడంతో పాటు బాధితురాలి నుంచి వాం గ్మూలం రికార్డు చేశారు. వీటి ఆధారంగా కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రెండు రోజుల జైలు, జరిమానా విధిం చారు. యాకత్‌పురకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌తో పాటు మరో వ్యక్తికి ఓ యువతితో స్నేహం ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకున్న ఇరువురూ కొన్ని ఫొటోలు, వీడియోల ఆధారంగా బెదిరిం పులకు దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన షీ-టీమ్స్ ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టుకు తరలించగా... ఒకరికి మూడు, మరొకరికి రెండు రోజుల శిక్ష పడింది.
ఛత్రినాకకు చెందిన అరుణ్‌కుమార్ తన తండ్రి చిన్ననాటి స్నేహితుడి కుమార్తె వెంటపడటం ప్రారంభిం చాడు. స్థానిక పోలీసుస్టేషన్‌లో కౌన్సిలింగ్ చేసినా, ఇరువురి పెద్దలూ మందలించినా తన పంథా మార్చుకోలేదు. దీంతో బాధితురాలు తన తండ్రితో కలిసి షీ-టీమ్స్‌కు ఫిర్యా దు చేయడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఇతడికి రెండు రోజుల జైలు, జరిమానా విధించారు. గోల్నాక ప్రాంతానికి చెందిన రవికాంత్ గతంలో ఓ యువతితో స్నేహం చేశాడు. ఆమె తండ్రి చదువుపై దృష్టిపెట్టమని మందలించడంతో రవికి దూరంగా ఉంటోంది. దీంతో యువతిపై కక్షపెంచుకున్న నింది తుడు ఆమె తన ఫోన్‌లో అందుబాటులో లేకపోవడంతో ఆమె సోదరికి ఫోన్లు చేయడం ప్రారంభించాడు.
ఫోన్‌ను తన మాజీ స్నేహితురాలికి ఇవ్వమని బెదిరిం పులకు దిగాడు. ఫేస్‌బుక్ ద్వారానూ బెదిరింపులు ప్రారంభించడంతో విష యం షీ-టీమ్స్‌కు చేరి అరెస్టయ్యాడు. న్యాయస్థానం రవికి రెండు రోజుల జైలు, జరిమానా విధించింది. ఈ ఆరుగురు పోకిరీలను డీఎస్పీ డి.కవిత నేతృత్వంలోని షీ-టీమ్స్ బృందాలు పట్టుకున్నామని స్వాతిలక్రా పేర్కొన్నారు.