
ఉస్మానియాలో పాము కలకలం
ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం సష్టించింది. దీంతో ఒక్కసారిగా రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం సష్టించింది. దీంతో ఒక్కసారిగా రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉస్మానియా ఆస్పత్రి పాతభవనంలోని సూపరింటెండెంట్ కార్యాలయం పక్కన ఉన్న ఎంఎం1 వార్డులో మంగళవారం పాము కనిపించడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దాంతో వారు ఆసుపత్రి ఉన్నతాధికారులను ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి.జి. రఘురామ్ నగరంలోని స్నేక్‌సొసైటీకి సమాచారం అందించారు. పాతబస్తీకి చెందిన స్నేక్‌సొసైటీ అధ్యక్షుడు ఆదిల్ ఉస్మానియా ఆస్పత్రి పాతభవనానికి చేరుకొని ఎంఎం1 వార్డులో పామును చాకచక్యంగా పట్టుకొన్నారు. అనంతరం ఆ పామును జూకు తరలించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గతంలో అనేక సంఘటనలు....
గతంలో కూడా ఉస్మానియా ఆస్పత్రిలోని ఆర్‌ఎంవో1 కార్యాలయం వద్ద ఓ పాము కలకలం సష్టించింది. ఉస్మానియా ఆస్పత్రిలో దట్టమైన చెట్లు, చెట్ల పొదలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములు నిత్యం రోగులు, వారి సహాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే.