కారు ఇంజన్‌లోకి పాము | snake in the car engine | Sakshi
Sakshi News home page

కారు ఇంజన్‌లోకి పాము

Published Wed, Aug 23 2017 9:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM

కారు ఇంజన్‌లోకి పాము - Sakshi

కారు ఇంజన్‌లోకి పాము

కారు ఇంజన్‌లోకి పాము దూరింది.

హైదరాబాద్‌‌: కారు ఇంజన్‌లోకి పాము దూరింది. ఈ సంఘటన ఖైరతాబాద్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. వోడాఫోన్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఎ.ఎస్‌.చౌదరి బిజినెస్‌ పని మీద ఏపీ 28 డీయూ 3121 అనే నంబర్‌ గల కారులో రైల్వేగేట్‌ సమీపంలోని ఒక మొబైల్‌ షాప్‌కు వచ్చారు.

ఈ సమయంలో కారు ముందు ఇంజన్‌ భాగంలో పాము ఉన్నట్లు గుర్తించిన స్థానికులు చౌదరికి తెలపారు. వెంటనే ఆయన ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీకి సమాచారం అందించారు. సొసైటీ నుంచి వచ్చిన మహ్మద్‌ అస్లాం, మెకానిక్‌ సాయంతో ఇంజిన్‌ కింది భాగంలో ఉన్న పాము పిల్లను బయటకు తీశారు. ఇంజిన్‌లోకి పాము ఎలా వెళ్లిందో తెలియదని చౌదరి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement