కేపీహెచ్‌బీకాలనీ (హైదరాబాద్): జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలోని అన్ని కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ పరిరక్షణ ఫోరం (టీజీపీఎఫ్) ఆధ్వర్యంలో ఇన్చార్జ్ వీసీ శైలజారామయ్యార్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరో విద్యార్ధిని బలి తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆ కళాశాల యాజమాన్యంపై, ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్ధులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
టీజీపీఎఫ్ టెక్నికల్ విభాగం ఇన్చార్జ్ బోయపల్లి అశోక్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపైనే చర్యలు తీసుకుంటున్నారని.. కళాశాలల యాజమాన్యాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంఆర్ కళాశాల ఈసీఈ మొదటి సంవత్సరం విద్యార్థి సాయినాథ్ ర్యాగింగ్ బారినపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు కళాశాల యాజమాన్యం పూర్తిగా బాధ్యత వహించాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
'ర్యాగింగ్ అరికట్టాలంటూ వీసీకి వినతిపత్రం'
Published Wed, Sep 2 2015 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM
Advertisement
Advertisement