stop ragging
-
‘స్టాప్ ర్యాగింగ్’ పోస్టర్ల ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్టాప్ ర్యాగింగ్’ పోస్టర్లను రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, మైదుకూరు, రాయచోటి, కమలాపురం ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఆర్అండ్బి అతిథిగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రిషితేశ్వరి లాగా ఏ విద్యార్థినిలు ర్యాగింగ్ భూతానికి బలికాకూడదన్నారు. ఆమె తల్లిదండ్రుల గర్భశోకం మరొకరికి కలగకూడదన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగం రెడ్డి తిరుపాల్‌రెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, జెడ్పీటీసీలు సుదర్శన్‌రెడ్డి, సురేష్‌యాదవ్, రైతు విభాగం అధ్యక్షుడు పి. ప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా పాల్గొన్నారు. -
'ర్యాగింగ్ అరికట్టాలంటూ వీసీకి వినతిపత్రం'
కేపీహెచ్‌బీకాలనీ (హైదరాబాద్): జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని అన్ని కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ పరిరక్షణ ఫోరం (టీజీపీఎఫ్) ఆధ్వర్యంలో ఇన్చార్జ్ వీసీ శైలజారామయ్యార్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరో విద్యార్ధిని బలి తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆ కళాశాల యాజమాన్యంపై, ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్ధులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. టీజీపీఎఫ్ టెక్నికల్ విభాగం ఇన్చార్జ్ బోయపల్లి అశోక్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపైనే చర్యలు తీసుకుంటున్నారని.. కళాశాలల యాజమాన్యాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంఆర్ కళాశాల ఈసీఈ మొదటి సంవత్సరం విద్యార్థి సాయినాథ్ ర్యాగింగ్ బారినపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు కళాశాల యాజమాన్యం పూర్తిగా బాధ్యత వహించాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.