
కొండగట్టు (చొప్పదండి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లి జేఎన్టీయూ కళాశాల హాస్టల్‌లో కళాశాల విద్యార్థిని బండారి శ్రీలక్ష్మి శనివారం ఆత్మహత్య చేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి(19) ఐటీ కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఉదయం 10 గంటలకు మొదటి పీరియడ్ క్లాస్‌కు హాజరైంది. కాసేపటికి ఆరోగ్యం బాగాలేక డిస్పె న్సరీకి వెళ్తున్నానని సంబంధిత ఇన్‌చార్జికి చెప్పి హాస్టల్ గదికి వెళ్లింది. తోటి విద్యార్థినులు ఎంత పిలిచినా తలుపు లు తీయకపోవడంతో ప్రిన్సిపాల్‌కు సమాచారమిచ్చారు. పోలీస్‌లు వచ్చి తలుపులు పగలకొట్టారు. శ్రీలక్ష్మి ఫ్యాన్‌కు చున్నీలతో ఉరివేసుకుని కనిపించింది.
ప్రేమే కారణమా..?
శ్రీలక్ష్మి, తన బావ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే తన బావ మరో అమ్మాయితో మాట్లాడటం, సన్నిహితంగా మెలగడంతో తట్టుకోలేక మనస్తాపం చెందిందని విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఎస్పీ అనంతశర్మ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామ న్నారు. ఫోన్ రికార్డు ఆధారంగా శ్రీలక్ష్మి బావ, మరో యువతిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment