jntu college
-
JNTU విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
-
జేఎన్టీయూలో విద్యార్థిని ఆత్మహత్య
కొండగట్టు (చొప్పదండి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లి జేఎన్టీయూ కళాశాల హాస్టల్లో కళాశాల విద్యార్థిని బండారి శ్రీలక్ష్మి శనివారం ఆత్మహత్య చేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి(19) ఐటీ కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఉదయం 10 గంటలకు మొదటి పీరియడ్ క్లాస్‌కు హాజరైంది. కాసేపటికి ఆరోగ్యం బాగాలేక డిస్పె న్సరీకి వెళ్తున్నానని సంబంధిత ఇన్చార్జికి చెప్పి హాస్టల్ గదికి వెళ్లింది. తోటి విద్యార్థినులు ఎంత పిలిచినా తలుపు లు తీయకపోవడంతో ప్రిన్సిపాల్‌కు సమాచారమిచ్చారు. పోలీస్‌లు వచ్చి తలుపులు పగలకొట్టారు. శ్రీలక్ష్మి ఫ్యాన్‌కు చున్నీలతో ఉరివేసుకుని కనిపించింది. ప్రేమే కారణమా..? శ్రీలక్ష్మి, తన బావ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే తన బావ మరో అమ్మాయితో మాట్లాడటం, సన్నిహితంగా మెలగడంతో తట్టుకోలేక మనస్తాపం చెందిందని విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఎస్పీ అనంతశర్మ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామ న్నారు. ఫోన్ రికార్డు ఆధారంగా శ్రీలక్ష్మి బావ, మరో యువతిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
నచ్చిన కోర్సా.. మెచ్చిన కళాశాలా?
జేఎన్టీయూ : ఎంసెట్ రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఈనెల 12 నుంచి ర్యాంకు కార్డులు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రోజే ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ప్రకటించనున్నారు. ఈ తరుణంలో ఇంజనీరింగ్ విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఏ కోర్సులో చేరాలి, ఏ కళాశాలను ఎంచుకోవాలి అనే సందిగ్దం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 16 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా, 20కి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వేల సంఖ్యలో సీట్లున్నా కళాశాలను, కోర్సును ఎంచుకోవడంలో తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు. ఏ కళాశాలలో ఏయే కోర్సులు బాగున్నాయి, వాటికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అని విస్తృతంగా పరిశీలిస్తున్నారు. కళాశాల ఎంపికే కీలకం నాణ్యమైన విద్యను అందించే కళాశాల ఎంపికే చాలా కీలకం. ఎంచుకున్న కళాశాలల ప్రాధాన్యత ఇంచు మించు ఒకేలా ఉన్నపుడే కోర్సు ఎంపిక ముఖ్యమవుతుంది. కళాశాలను ఎంపిక చేసుకునే క్రమంలో అక్కడ విద్యార్థికి దిశానిర్ధేశం చేసే వాతావరణం ఉందో లేదో తెలుసుకోవాలి. అక్కడి అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు సాధించిన ఘనతను పరిగణలోకి తీసుకోవాలి. బోధన, ల్యాబ్ నాణ్యతగా ఉన్నాయా, లేదా అని పరీశీలించాలి. 100 శాతం ప్రాంగణ నియామకాలున్న వాటిపై దృష్టి పెట్టాలి. అలాగే కళాశాలకు రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఆకతాయి చేష్టల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. భోదన, ప్రయోగశాల, గ్రంథాలయాలు, వసతి గృహం, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో వైబ్సైట్ల ద్వారానో, ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారానో తెలుసుకోవాలి. అక్కడ చదువుతున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తెలిసిన వారితో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించాలి. వీటన్నింటికితోడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే నాలుగేళ్లపాటు చదవాల్సిన కళాశాల విషయంలో తప్పటడుగులు వేస్తే అది భవిష్యత్‌పై చెడు ప్రభావం చూపుతుంది. జిల్లాలో 8,050 సీట్లు జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలతోపాటు 16 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. 8,050 సీట్లు బీటెక్లోను, 360 సీట్లు బీఫార్మసీలోనూ ఉన్నాయి. ఎంసెట్‌కు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 7,600 మంది హాజరయ్యారు. ఇందులో 6,171 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్వీయూ రీజియన్ పరిధిలో అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారు స్థానికులవుతారు. వచ్చిన ర్యాంకుల ఆధారంగా 85 శాతం సీట్లు వీరికే కేటాయిస్తారు. జేఎన్టీయూపైనే ఆసక్తి నాణ్యతతో కూడిన ఇంజనీరింగ్ విద్యనందించడం, ప్రాజెక్టుల్లో తర్ఫీదు ఇవ్వడం, టాప్ టెన్‌లో ఉన్న బహుళ జాతి సంస్థలైన ఐబీఎం, టీసీఎస్‌లు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు జేఎన్టీయూపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 285 మంది టీసీఎస్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సీటొస్తే ఉద్యోగం గ్యారంటీ అనే ధీమా వారిలో వ్యక్తమవుతోంది. ఎస్కేయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఇంజనీరింగ్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేస్తారు. రెండు సంవత్సరాల నుంచి మెకానికల్ విభాగం ప్రారంభించారు. సివిల్, ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్‌లో నూతనంగా బీటెక్ బాలుర వసతి గృహాన్ని నిర్మించారు. నైపుణ్యమే ప్రామాణికం విద్యార్థి ఇంజనీరింగ్‌లో సాధించిన నైపుణ్యమే ఉద్యోగానికి తొలిమెట్టు. ప్రకటనల కన్నా స్వయంగా ఆయా కళాశాలలను పరిశీలించిన తర్వాతే చేరాలా? వద్దా? అని నిర్ణయించుకోవాలి. 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. నాలుగేళ్లు ప్రణాళికాబద్ధంగా చదివితే ఎక్కడైనా ఉపాధి దొరుకుతుంది. - ఎ.ఆనందరావు, అకడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్, జేఎన్టీయూ అనుభవంతో కూడిన అధ్యాపకులు ఉండాలి ఇంజినీరింగ్‌ను ఆషామాషీగా అభ్యసించకూడదు. ఇంటి దగ్గర నుంచి కార్పొరేట్ కొలువుల వరకు విద్యార్థులను తీసుకెళ్లే బాధ్యత కళాశాలలదే. వాటిలో అనుభవమున్న అధ్యాపకులు, ఈ లెర్నింగ్ లాంటి సదుపాయాలు ఉండాలి. అన్ని బ్రాంచుల వారు ఐటీ వైపు వెళ్లడానికి అవకాశం ఉంది కాబట్టి బ్రాంచ్ ఎంపిక కీలకం కాబోదు. - కె.హేమచంద్రారెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, జేఎన్టీయూ ప్రకటనలు చూసి మోసపోవద్దు ప్లేస్‌మెంట్స్ ప్రకటనలు చూసి మోసపోవద్దు. ఆ ఉద్యోగాలు ఎలాంటి కంపెనీల్లో వచ్చాయో పరిశీలించాలి. ఇంజినీరింగ్ అంటే అందమైన ఊహాలోకం అనుకోకుండా నాలుగేళ్ల కోర్సు కష్టపడి చదవాలి. కేవలం పట్టా కోసమే చదివితే సమయం వృథా అవుతుందే తప్ప ప్రయోజనం లేదు. కమ్యూనికేషన్స్ స్కిల్స్‌పై దృష్టి సారించాలి. - కె.విజయ్‌కుమార్, అడ్మిషన్స్ డైరెక్టర్, జేఎన్టీయూ -
తిరుమలలా కొండగట్టు అభివృద్ధి
► తక్షణమే రూ.5కోట్లు మంజూరు ► 200 గదులతో వసతిగృహం నిర్మాణం ► కొంపల్లె చెరువును రిజర్వాయర్‌గా తీర్చిదిద్దుతాం ► ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి ► రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మల్యాల : కొండగట్టు ఆలయాన్ని తిరుమల తిరుపతి మాదిరిగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆలయ అభివృద్ధికి తక్షణమే రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధిపై జేఎన్టీయూ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే బొడిగ శోభతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండగట్టు మాస్టర్ ప్లాన్, భూములకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ భూముల్లో వెలిసిన ఆక్రమణలు తొలగించాలని అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుదధ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని ఆదేశించారు. రానున్న మూడేళ్లలో కొండగట్టు ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో మొదట కాలినడక వచ్చే భక్తుల కోసం మెట్లదారిలో షెడ్డు వేయాలని సూచించారు. అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భక్తుల కోసం రెండు వందల గదుల వసతిగృహం నిర్మిస్తామన్నారు. మాస్టర్ ప్లాన్‌లో భక్తుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకుని రూపొందించాలన్నారు. అలాగే మల్యాల, కొడిమ్యాల మండలాల ప్రజలకు తాగునీరందించడంతోపాటు కొండగట్టుకు నీరందించే కొంపల్లె చెరువును రిజర్వాయర్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక జీవో జారీ చేశారని, దీంతో కొంపల్లె చెరువులోకి ఎస్సారెస్పీ నీరు రావడం లేదని ఎమ్మెల్యే బొడిగె శోభ పేర్కొన్నారు. కొంపల్లె చెరువు నింపేందుకు జీవో తీసుకురావాలని కోరగా, జీవోలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని, రెండు మండలాల ప్రజలకు నీరందించడంతోపాటు కొండగట్టుకు నీరందించేలా జీఓ జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాంక, ఆలయ ఈఓ అమరేందర్, ఈఈ రాజేశ్, డీఈఈ వసీయోద్దీన్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, తహశీల్దార్ శ్రీహరిరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌మూర్తి, డీఎస్పీ రాజేందర్, సీఐ శ్రీనివాస్‌చౌదరి, ఎస్సై ప్రవీణ్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు, సర్పంచ్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంజన్న సన్నిధిలో మంత్రి పూజలు కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మె ల్యే బొడిగె శోభ బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ ఈఓ అమరేందర్ మంత్రి రాజేందర్‌ను శాలువాతో సన్మానించారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం నూతన పుష్కరిణిని పరిశీలించారు. -
'ర్యాగింగ్ అరికట్టాలంటూ వీసీకి వినతిపత్రం'
కేపీహెచ్‌బీకాలనీ (హైదరాబాద్): జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని అన్ని కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ పరిరక్షణ ఫోరం (టీజీపీఎఫ్) ఆధ్వర్యంలో ఇన్చార్జ్ వీసీ శైలజారామయ్యార్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరో విద్యార్ధిని బలి తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆ కళాశాల యాజమాన్యంపై, ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్ధులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. టీజీపీఎఫ్ టెక్నికల్ విభాగం ఇన్చార్జ్ బోయపల్లి అశోక్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపైనే చర్యలు తీసుకుంటున్నారని.. కళాశాలల యాజమాన్యాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంఆర్ కళాశాల ఈసీఈ మొదటి సంవత్సరం విద్యార్థి సాయినాథ్ ర్యాగింగ్ బారినపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు కళాశాల యాజమాన్యం పూర్తిగా బాధ్యత వహించాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
జేఎన్టీయూ కాలేజీలో విద్యార్థుల సందడి
-
విద్యార్థులు సోదరభావంతో మెలగాలి
పులివెందుల(వైఎస్సార్ జిల్లా): విద్యార్థులు సోదరభావంతో మెలగాలని వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ సీఐ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం పులివెందులలోని జేఎన్టీయూ కళాశాలలో జరిగిన ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌తో విద్యార్థుల జీవితం అంధకారంలో పడుతుందని చెప్పారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటం చట్టరిత్యా నేరమని తెలిపారు. విద్యార్థులు సోదరభావంతో మెలగాలని ఆయన సూచించారు. -
హాస్టల్లోకి విద్యార్థిలా ప్రవేశించి...
అనంతపురం: జేఎన్టీయూ కళాశాల ఎల్లోరా వసతిగృహంలోకి బయటివ్యక్తి విద్యార్థిగా ప్రవేశించి ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసి విద్యార్థుల కంటపడ్డాడు. దేహశుద్ధి చేసి రూంలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే..ఆదివారం మధ్యాహ్నం కళాశాలలోని ఎల్లోరా వసతి గహంలో విద్యార్థులందరూ వారివారి గదుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి షాట్ ధరించి విద్యార్థిలాగానే ఓ గదిలోకి ప్రవేశించాడు. ల్యాప్‌టాప్ చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఈయన నడవడిక అనుమానం వచ్చిన గదిలోని విద్యార్థులు ప్రశ్నించారు. ఎవరు, ఎందుకొచ్చారంటూ ప్రశ్నించారు. తాను కళాశాల విద్యార్థినేనంటూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. కళాశాలలో ఎప్పుడూ చూడలేదే అని విద్యార్థులు ప్రశ్నించగా మాట దాటవేస్తూ అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ఇదేంది బాబూ..!
- ప్రతిపక్ష నేత జిల్లాపై చంద్రబాబు వివక్ష - జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీలకు నిధుల కోత - సాగునీటి ప్రాజెక్టులకు అంతంతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ జిల్లా అంటేనే ఎందుకో గిట్టనట్లుంది. సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయలేదనే ఏకైక కారణంతో జిల్లాపై వివక్ష చూపుతున్నారు. వైఎస్ హయాంలో ఇబ్బడిముబ్బడిగా నిధులు విడుదల చేసి జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయకుండా జిల్లాను తిరోగమనంలోకి నెడుతున్నారు. సాక్షి,కడప : రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపక్ష నేతల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు విషయంలో వివక్ష చూపుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ వచ్చారు. అయితే, సీఎం చంద్రబాబు త మ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చిన నియోజకవర్గాలను ఒక విధంగా, ప్రతికూల ఫలితాలు వచ్చిన సెగ్మెంట్లను మరో రకంగా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. అనంతపురం, కాకినాడ జేఎన్టీయూ కళాశాలలకు భారీగా బడ్జెట్లో నిధులు కేటాయించడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతోపాటు మాజీ సీఎం కిరణ్ సొంత నియోజకవర్గమైన పీలేరుకు కూడా బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీలకు నిధుల కోత గ్రామీణ పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చి వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని భావించిన దివంగత సీఎం వైఎస్సార్ పులివెందులలో జేఎన్టీయూను నెలకొల్పగా, 2012లో మాజీ సీఎం కిరణ్ పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జేఎన్టీయూను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఇతర జేఎన్టీయూలకు ఇబ్బడి ముబ్బడిగా కావాల్సిన నిధులు కేటాయించిన కొత్త సర్కార్.. కొత్తగా ఏర్పాటైన కలికిరిలోని జేఎన్టీయూ కళాశాలకు రూ. 212 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపితే, కేవలం రూ. 12 కోట్లు మాత్రమే మొక్కుబడిగా కేటాయించి చేతులు దులుపుకుంది. అలాగే అనంతపురం జేఎన్టీయూకు రూ. 24 కోట్లతో బ్లాక్ గ్రాంటుతోపాటు అదనంగా రూ. 5.71 కోట్లు కేటాయించారు. అదే పులివెందుల జేన్టీయూకు బ్లాక్ గ్రాంట్ కింద వచ్చే రూ. 24 కోట్లలోనే కోత విధించారు. దాదాపు రూ. 22 లక్షలను కోత పెట్టడంతో పాటు కొత్త నిధులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ బ్లాక్ గ్రాంటుతో కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది జీతభత్యాలతోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రతియేటా ఈ గ్రాంటు కింద నిధులను విడుదల చేస్తుంది. ఇక వేంపల్లె సమీపంలోని ఇడుపులపాయలో నెలకొల్పిన ట్రిపుల్ ఐటీకి కూడా పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదు. కొత్తగా నిధులేమీ విడుదల చేయలేదు. యోగి వేమన యూనివర్సిటీకి బడ్జెట్ విడుదల కాక.. అభివృద్ధి లేక యూనివర్సిటీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రిమ్స్‌కు కూడా బడ్జెట్లో ఒరిగిందేమీ లేదు. కనీసం ఎయిమ్స్ స్థాయికి విస్తరిస్తారని ఆశించినా దాని ఊసే లేదు. పరిశ్రమల స్థాపనకు ఏదీ బడ్జెట్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ జిల్లాలో పరిశ్రమలకు చంద్రబాబు సర్కార్ పెద్దగా బడ్జెట్ కేటాయించ లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనలో భాగంగా ప్రకటించిన ఒక్క సెయిల్ మినహా ఎలాంటి పరిశ్రమలకు నిధుల కేటాయింపులు లేవు. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన వైఎస్సార్ జిల్లాలో అగ్రిజోన్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఎలాంటి నిధులు కేటాయింలేదు. ఆస్బెస్టాస్, ముగ్గురాయి, నాపరాయి లాంటి ఖనిజ సంపద కలిగిన జిల్లాలో కనీసం ఆ స్థాయి పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహం చూపకపోవడంతో పారిశ్రామికవేత్తల్లో నిరుత్సాహం నెలకొంది. ఐజీ కార్ల్‌లో పరిశోధనలు కరువు 650 ఎకరాల్లో రూ. 385 కోట్లతో చేపట్టిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు కరువయ్యాయి. వైఎస్ హయాంలో వంద కోట్ల బడ్జెట్‌ను కేటాయించేవారు. ప్రస్తుత టీడీపీ సర్కార్ కేవలం రూ. 15.18 కోట్లను విడుదల చేయనుంది. అయితే రూ. 15 కోట్లతో టీకాల ఉత్పత్తి, గడ్డి పెంపకం, లేగదూడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎంతోమంది ఉన్నత స్థాయి అధికారులు వచ్చి అది చేస్తాం..ఇది చేస్తామని చెప్పారేగానీ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికీ పాడుబడ్డ భవనాలు, దుమ్ము ధూళితో నిండి లోపల అధ్వానంగానే ఐజీ కార్ల్ దర్శనమిస్తోంది. రూ.15 కోట్లతో అధికారులు ఎలాంటి పరిశోధనలు చేస్తారో వేచి చూడాల్సిందే. సాగునీటి ప్రాజెక్టులకు అంతంత మాత్రమే పులివెందుల నియోజకవర్గంతోపాటు జిల్లాలోని ప్రాజెక్టులకు కూడా బడ్జెట్లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వైఎస్సార్ హయాంలో జిల్లా అభివృద్ధికి నిధుల వర్షం కురిస్తే..నేడు అంతంత మాత్రంగానే టీడీపీ సర్కార్ బాబు మార్క్ బడ్జెట్‌ను చూపుతోంది. తెలుగుగంగ ప్రాజెక్టుకు 2012-13లో రూ. 160 కోట్లు, 2013-14లో రూ. 195 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు మాత్రం రూ. 89 కోట్లతో మాత్రమే సరిపెట్టారు. అలాగే జీఎన్ఎస్ఎస్కు సంబంధించి 2012-13లో రూ. 419.86 కోట్లు, 2013-14లో రూ. 380 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తే ప్రస్తుతం రూ. 55.14 కోట్లు ఆధునికీకరణకు కేటాయించారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)కి సంబంధించి 2012-13లో రూ. 279.39 కోట్లు, 2013-14లో రూ. 90 కోట్లు వైఎస్సార్ అందించగా, టీడీపీ సర్కార్ ప్రస్తుతం రూ. 27.81 కోట్లను మాత్రమే కేటాయించింది. అలాగే మైలవరానికి రూ. 8.16 కోట్లు, కేసీ కెనాల్‌కు రూ. 8.40 కోట్లు అంతంతమాత్రంగానే అందించారు. హంద్రీ-నీవాకు గతంలో వందల కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించి సాగునీటి రంగానికి కావాల్సిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను అందించలేదు.