విద్యార్థులు సోదరభావంతో మెలగాలని వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ సీఐ మహేశ్వర్‌రెడ్డి అన్నారు.
పులివెందుల(వైఎస్సార్ జిల్లా): విద్యార్థులు సోదరభావంతో మెలగాలని వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ సీఐ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం పులివెందులలోని జేఎన్‌టీయూ కళాశాలలో జరిగిన ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌తో విద్యార్థుల జీవితం అంధకారంలో పడుతుందని చెప్పారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటం చట్టరిత్యా నేరమని తెలిపారు. విద్యార్థులు సోదరభావంతో మెలగాలని ఆయన సూచించారు.