హాస్టల్‌లోకి విద్యార్థిలా ప్రవేశించి... | Thief try to steal laptop at hostel by entering as a student | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లోకి విద్యార్థిలా ప్రవేశించి...

Published Sun, Mar 15 2015 10:10 PM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

హాస్టల్‌లోకి విద్యార్థిలా ప్రవేశించి...

హాస్టల్‌లోకి విద్యార్థిలా ప్రవేశించి...

అనంతపురం: జేఎన్‌టీయూ కళాశాల ఎల్లోరా వసతిగృహంలోకి బయటివ్యక్తి విద్యార్థిగా ప్రవేశించి ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసి విద్యార్థుల కంటపడ్డాడు. దేహశుద్ధి చేసి రూంలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే..ఆదివారం మధ్యాహ్నం కళాశాలలోని ఎల్లోరా వసతి గహంలో విద్యార్థులందరూ వారివారి గదుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి షాట్ ధరించి విద్యార్థిలాగానే ఓ గదిలోకి ప్రవేశించాడు. ల్యాప్‌టాప్ చోరీ చేసేందుకు ప్రయత్నించాడు.

ఈయన నడవడిక అనుమానం వచ్చిన గదిలోని విద్యార్థులు ప్రశ్నించారు. ఎవరు, ఎందుకొచ్చారంటూ ప్రశ్నించారు. తాను కళాశాల విద్యార్థినేనంటూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. కళాశాలలో ఎప్పుడూ చూడలేదే అని విద్యార్థులు ప్రశ్నించగా మాట దాటవేస్తూ అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement