వెబ్‌సైట్లో పొందుపరిచిన ఏపీపీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి కొత్తగా ప్రవేశపెడుతున్న స్క్రీనింగ్ టెస్టు సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. సిలబస్ సమాచారాన్ని ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో బుధవారం పొందుపరిచారు. సిలబస్‌లోని అంశాలిలా ఉన్నాయి.
కరెంట్ అఫైర్స్:రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, కళలు, క్రీడలు, సాంస్కృతిక,పాలనా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అంశాలు. రాజ్యాంగంలోని గణతంత్ర, ప్రాథమిక హక్కులు, విధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక సంస్థలు, కేంద్ర, రాష్ట్ర చట్టసభలు, కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిపాలన, చట్టపరమైన సంబంధాలు గిరిజన ప్రాంతాల పాలనా వ్యవస్థ.
భారత ఆర్థికాభివృద్ధి: మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్య్ర పూర్వపు భారత ఆర్థిక వ్యవస్థ, స్వాంతంత్య్రానంతరం దేశంలో అభివృద్ధి ప్రణాళికలు, ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్మిక విధానాలు, భారతదేశంలో వ్యవసాయం, హరిత విప్లవం పాత్ర, ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు, జనాభా.
1999 గ్రూప్-2 పోస్టుల భర్తీపై కసరత్తు
1999 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితాను మరోసారి రూపొందించి పోస్టింగ్‌లు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంపై ఏపీపీఎస్సీ ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. మరో పక్షం రోజుల్లో ఈ నియామకాలు పూర్తిచేయవచ్చని తెలుస్తోంది. త్వరలోనే మెరిట్ జాబితాను ఖరారు చేసి నియామకాలు పూర్తిచేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. తాజా మెరిట్ జాబితా ప్రకారం 317 మంది కొత్తగా ఎంపికైన వారికి ఈనెలాఖరు లేదా వచ్చే నెలారంభంలో ఇంటర్వ్యూలు ఉండవచ్చని తెలుస్తోంది.
గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్టు సిలబస్ ఇదే
Published Thu, Sep 22 2016 12:49 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM
Advertisement