ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్లండి | Take the whole party to the Prime Minister | Sakshi
Sakshi News home page

ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్లండి

Published Wed, Aug 9 2017 2:00 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్లండి - Sakshi

ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్లండి

ముఖ్యమంత్రికి తమ్మినేని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారాలను తగ్గించడానికి సీఎం అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ‘జీఎస్టీ భారాలపై రాజీలేని పోరాటం చేస్తాం’ అని ముఖ్యమంత్రే ప్రకటించి 24 గంట లు గడవకముందే ‘ఫలితాలు ఎలా ఉంటాయో వేచిచూద్దాం’ అని పేర్కొ నడం విడ్డూరంగా ఉందన్నారు.

కేసీఆర్‌ స్వప్రయోజనాల కోసం కేంద్రంలో బీజేపీతో రాజీపడి రాష్ట్ర ప్రజలను బలి చేస్తున్నారన్నారని  మంగళవారం ఇక్కడ జరిగిన పార్టీ రాష్ట్ర కార్యకర్తల సమావేశంలో తమ్మినేని ఆరోపించారు.  కాగా, రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయని, పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ్మినేని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement