సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక వ్యవహారంలో దళితులు, బీసీలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, దీనిని నిరసిస్తూ రాజకీయపార్టీలు చేస్తున్న ప్రజాస్వామిక పోరాటాలకు, సభలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదన్నారు. ప్రజాస్వామ్యం లో ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలతో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం పోరాడుతాయని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తారా?: తమ్మినేని
Published Mon, Jul 31 2017 1:47 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలపై జరుగుతున్న ఉద్యమాలు, పోరాటాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రజాస్వామిక హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు.

Advertisement
Advertisement