హైదరాబాద్ : ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో స్కూటీని టిప్పర్ ఢీకొంది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో శ్రీకాంత్ (14) అనే బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. స్కూటీపై ఉన్న వెంకటేష్ అనే మరో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు.