20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు! | Telangana Assembly meetings starts from 20 | Sakshi
Sakshi News home page

20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!

Published Fri, Oct 3 2014 2:08 AM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు! - Sakshi

20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!

20 పనిదినాలుండేలా షెడ్యూల్ రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖరరావు సూత్రప్రాయంగా నిర్ణయించారు. మొత్తం 20 పనిదినాలు ఉండేలా అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను రూపొందించాలని అధికారులకు సూచించారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం కేసీఆర్ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్, మండలి చైర్మన్‌తో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడారు. మొత్తం 20 పనిదినాలుండేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నామని పేర్కొన్న ట్లు సమాచారం. దీపావళి సందర్భంగా 23 నుంచి నాలుగురోజులపాటు సమావేశాలకు విరామం ఇచ్చేలా తేదీలను ఖరారు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement