జయలలిత, చెన్నమనేనిలకు అసెంబ్లీ నివాళి
Published Mon, Dec 19 2016 1:01 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
హైదరాబాద్: ఇటీవల మృతిచెందిన ప్రముఖులకు తెలంగాణ శాసనసభ సోమవారం నివాళులర్పించింది. ప్రశ్నోత్తరాలు పూర్తి కాగానే స్పీకర్ మధుసూదనాచారి ఇటీవల మృతి చెందిన ప్రముఖులకు సంతాపం ప్రకటించేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సిరిసిల్ల ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు, తమిళనాడు సీఎం జయలలితతో పాటు ఉజ్జిని నారాయణరావు(మునుగోడు), విఠల్‌రావు దేశ్‌పాండే(ఆదిలాబాద్), కోనేరు నాగేశ్వర్‌రావు(కొత్తగూడెం), బొజ్జపల్లి రాజయ్య(స్టేషన్ ఘన్‌పూర్)లకు నివాళులర్పించారు. సీఎంగా జయలలిత చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.
Advertisement
Advertisement