అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో శనివారం 11 మంది ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు నిర్వహించకముందే వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మందిని, టీటీడీపీకు చెందిన ఇద్దరు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.
శాసన మండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద నోట్ల రద్దుపై ప్రకటన చేశారు. నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను తొలగించి క్యాష్ లెస్ చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను త్వరలో టీఎస్ వ్యాలెట్‌ను తీసుకొస్తామని కేసీఆర్ తెలిపారు. తొందరలోనే సిద్దిపేట జిల్లా క్యాష్‌లెస్‌గా మారుతుందని కేసీఆర్ వెల్లడించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభంకానున్నాయి.