న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా న్యాయాధికారుల సస్పెన్షన్ను రీకాల్ చేయాల్సిందిగా వారు సీజేను కోరారు. అయితే ఈ వ్యవహారంలో.. సమ్మె విరమించాల్సిందిగా బార్ అసోసియేషన్ సభ్యులను సీజే కోరారు. న్యాయవాదులు ఆందోళనకరమైన పరిస్థితులు సృష్టించొద్దని ఆయన సూచించారు.
హైకోర్టు విభజనపై కేంద్ర మంత్రి సదానంద గౌడతో మాట్లాడుతానని తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులకు సీజే తెలిపారు. అయితే.. సమ్మె విరమించిన తరువాతే ఈ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సీజే తేల్చి చెప్పారు. సమ్మె విరమించే విషయంలో సభ్యులందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బార్ అసోసియేషన్ సభ్యులు సీజేకు వెల్లడించినట్లు తెలిపారు.
సీజేతో టీ బార్ అసోసియేషన్ సభ్యుల భేటీ
Published Sun, Jul 3 2016 1:11 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement