ముగిసిన తెలంగాణ ఎంసెట్-3 పరీక్ష
Published Sun, Sep 11 2016 7:07 PM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM
హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్-3 పరీక్ష తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో గైర్హాజరయ్యారు. పరీక్ష కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికి మూడుసార్లు పరీక్ష పెట్టడంతో విద్యార్థుల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉందని పరిశీలకులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో 96 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.
రీజినల్ కోఆర్డినేటర్, వీఆర్ సిద్ధార్థఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎంసెట్-3 మెడిసిన్, బీడీఎస్ సీట్లకు ప్రవేశ పరీక్షకు విజయవాడ రీజియన్‌లో 14 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 7542 మంది రాయాల్సి ఉండగా కేవలం 4213 మంది హాజరయ్యారని తెలిపారు. కాగా ఎంసెట్ రాయటానికి విద్యార్థులతో పాటు తల్లితండ్రులు పెద్దఎత్తున తరలి రావటంతో పరీక్షా కేంద్రాల వద్ద హడావుడి చోటు చేసుకుంది.
Advertisement