స్మితా సబర్వాల్ కు అండగా నిలిచిన టీసర్కార్ | Telangana government supports to smitha sabarwal | Sakshi
Sakshi News home page

స్మితా సబర్వాల్ కు అండగా నిలిచిన టీసర్కార్

Published Thu, Aug 20 2015 7:19 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

స్మితా సబర్వాల్ కు అండగా నిలిచిన టీసర్కార్

స్మితా సబర్వాల్ కు అండగా నిలిచిన టీసర్కార్

హైదరాబాద్ : ఔట్ లుక్ మ్యాగజైన్ పై పరువు నష్టం కేసులో ఐఏఎస్ అధికారణి, సీఎంఓలో అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్కు తెలంగాణ సర్కారు అండగా నిలిచింది. ఈ కేసు విషయమై ఆమెకు కోర్టు ఖర్చుల కింద రూ.15 లక్షలను ఇస్తున్నట్లు టీఎస్ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాగజైన్ ఆమె గురించి అభ్యంతరకరంగా కార్టూన్ ప్రచురించినప్పటి నుంచి ఆ మ్యాగజైన్ పై సబర్వాల్ న్యాయ పోరాటం కొనసాగిస్తున్న విషయం విదితమే.

ఔట్ లుక్ మ్యాగజైన్ కొన్ని రోజుల కిందట 'నో బోరింగ్ బాబు' అనే శీర్షికతో ఓ కామెంట్ ప్రచురించింది. 'ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగే సమావేశాలకు అద్భుత వస్త్రధారణతో హాజరయ్యే ఓ బ్యూరోక్రాట్.. 'కంటికి ఇంపైన మహిళా అధికారి'గా అందరూ కితాబిస్తుంటారని చెబుతూ.. జీన్స్, టీషర్ట్ వేసుకున్న ఓ అధికారిణి ర్యాంప్పై నడుస్తుంటే.. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఆమెనే చూస్తోన్న అభ్యంతరకర కార్టూన్ ను ప్రచురించిన విషయం విదితమే. అప్పటి నుంచి ఈ విషయంపై సబర్వాల్ న్యాయ పోరాటం చేస్తున్నారు. తన న్యాయవాది ద్వారా ఆ మేగజైన్ కు నోటీసులు పంపి.. క్షమాపణలు చెప్పాలని గతంలోనే డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement