హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ల్లోకి ఎక్కింది. ఈ సర్వేను జాతీయ రికార్డుగా గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్‌రికార్డ్స్ ఎడిటర్ విజయ ఘోష్ తెలంగాణ ప్రభుత్వానికి సర్టిఫికేట్ పంపారు. సమగ్ర కుటుంబ సర్వే జరిగిన విధానం వివరాలను కూడా ఇందులో పేర్కొన్నారు. భారత దేశంలో గతంలో ఎన్నడూ, మరే రాష్ట్రంలో జరగని విధంగా ఒకే రోజు తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులు 1.09 కోట్ల కుటుంబాల వివరాలు సేకరించింది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సర్వే నిర్వహించారని, కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు, వృత్తులు, ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలన్నీ సేకరించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడిందని సంస్థ పేర్కొంది.
లిమ్కా రికార్డ్స్‌లో సమగ్ర కుటుంబ సర్వే
Published Thu, May 26 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM
Advertisement