ఆగాఖాన్ అకాడమీలో కైట్ ఫెస్టివల్
Published Fri, Jan 13 2017 12:47 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
హైదరాబాద్: తెలంగాణ గొప్పతనాన్ని చాటే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్(పతంగుల పండుగ ) ప్రారంభమైంది. ఆగాఖాన్ అకాడమీలో ఈ కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. కైట్ ఫెస్టివల్‌కు తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి చందూలాల్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రంగురంగుల గాలిపటాలు విభిన్న ఆకృతుల్లో కనువిందు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలతోపాటు దేశవిదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
Advertisement
Advertisement