భయానికి అర్థం తెలియని ధీశాలి | Telangana proud journalist Shahid soyabulla Khan | Sakshi
Sakshi News home page

భయానికి అర్థం తెలియని ధీశాలి

Published Mon, Aug 22 2016 6:01 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Telangana proud journalist Shahid soyabulla Khan

-బీజేపీ శాసనసభ పక్షనేత జి.కిషన్‌రెడ్డి
కాచిగూడ

భయానికి అర్థం తెలియని ధీశాలి ఆయన.. నిజం చెప్పడానికి వెరువని సాహాసం అతనిది. ఆశయాల కోసం రాజీపడని అక్షర తపస్వీ, జాతి జనుల కోసం అమరుడయ్యాడు. మత దురంహాంకారానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజల తరపున కలం పట్టిన తొలితరం పాత్రికేయుడు, చరిత్ర గర్వించదగిన తెలంగాణ జర్నలిస్ట్ షహీద్ సోయబుల్లా ఖాన్. ఆయన 69వ వర్థంతి సభ సోమవారం బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలో జరిగింది.

ఈ సందర్భంగా పార్టీల కతీతంగా ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని షోయబుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు తిరంగా యాత్రను బీజేపీ శాసనసభ పక్షనేత, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ తొలితరం జర్నలిస్టు షహీద్ షోయబుల్లా ఖాన్ అని అన్నారు. నిజాం ప్రభుత్వం సాగించిన ప్రజా వ్యతిరేక విధానాలను, దమనకాండను షోయబుల్లాఖాన్ ఎండగట్టారని అన్నారు. అక్షరరూపమెత్తి నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

పాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన యుద్దం ప్రకటించిన యువజర్నలిస్టు షోయబుల్లా ఖాన్ అని అన్నారు. నిరంకుశ నిజాం పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన నిఖార్సయిన జాతీయ వాది అని అన్నారు. అక్షరాలను ఆయుదాలుగా మార్చుకుని దుర్మార్గ దురంహాంకార దోపిడి పాలనపై పోరాటం చేశారని తెలిపారు. రజాకార్ల దౌర్జన్యాలపై అక్షరాయుదాలు, వార్తలనే అస్త్రాలుగా సంధించి ప్రజల్లో చైతన్యం తెచ్చిన వ్యక్తి అని అన్నారు. ఇమ్రోజ్ పత్రికను స్థాపించి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు, నిజాం ప్రభుత్వం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ నిజాం పాలనను, నిజాం యొక్క నిరంకుశ ధోరణిని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి షోయబుల్లా ఖాన్ అని అన్నారు. తెలంగాణను స్వతంత్య్ర భారతదేశంలో కలపాలని పోరాటం చేసిన షోయబుల్లాఖాన్‌కు ప్రభుత్వాలు తగిన గుర్తింపు కల్పించలేదని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అనీఫ్ ఆలీ, జాతీయ ఉపాధ్యక్షలు లాయక్ ఆలీ, పార్టీ నగర ఉపాధ్యక్షులు ఎక్కాల నందు, సల్లా నరేందర్, ఎ.సూర్యప్రకాష్ సింగ్, ఎస్.అరవింద్, శీర్‌సాగర్, హాజారి బాబు, పోతంశెట్టి సురేష్, మించు ఆనంద్, ఎస్‌ఎస్ రాము, తదితరులు పాల్గొన్నారు.
 

 

ఇమ్రోజ్ పత్రికను స్థాపించి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు, నిజాం ప్రభుత్వం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ నిజాం పాలనను, నిజాం యొక్క నిరంకుశ ధోరణిని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి షోయబుల్లా ఖాన్ అని అన్నారు. తెలంగాణను స్వతంత్య్ర భారతదేశంలో కలపాలని పోరాటం చేసిన షోయబుల్లాఖాన్‌కు ప్రభుత్వాలు తగిన గుర్తింపు కల్పించలేదని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అనీఫ్ ఆలీ, జాతీయ ఉపాధ్యక్షలు లాయక్ ఆలీ, పార్టీ నగర ఉపాధ్యక్షులు ఎక్కాల నందు, సల్లా నరేందర్, ఎ.సూర్యప్రకాష్ సింగ్, ఎస్.అరవింద్, శీర్‌సాగర్, హాజారి బాబు, పోతంశెట్టి సురేష్, మించు ఆనంద్, ఎస్‌ఎస్ రాము, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement