సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ ఎంపీ కవిత గురువారం ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను సందర్శించారు. భవన్‌లో అన్ని వసతులు కల్పించడంతోపాటు జర్నలిస్టులకు మీడియా రూం ఏర్పాటు చేయాలని, మీడియా సెంటర్‌లో సిబ్బంది సంఖ్య పెంచాలని అధికారులను కోరారు.
ఢిల్లీలో పనిచేస్తున్న తెలం గాణ జర్నలిస్టుల హెల్త్ కార్డులను ఢిల్లీలోని అన్ని ఆస్పత్రుల్లో వర్తింపజేయాలని భవన్ ఆర్సీ అశోక్‌కుమార్‌ను కోరారు. రాష్ట్రం చేనేత వస్త్రాలు, హస్తకళలు, హైదరాబాద్ బిర్యానీ సహా తెలంగాణ వంటకాలను అందుబాటులో ఉంచేందుకు భవన్‌లో ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా, ఢిల్లీలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను టీయూడబ్ల్యూజే ఢిల్లీ కమిటీ అధ్యక్షుడు లెంకల ప్రవీణ్‌కుమార్, సంఘం ప్రధాన కార్యదర్శి పబ్బ సురేశ్ తదితరులు ఎంపీ కవితకు వివరించారు.
ఫెసిలిటేషన్ సెల్ ప్రారంభం
తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన సహాయక కార్యాలయాన్ని (ఫెసిలిటేషన్ సెల్) టీఆర్‌ఎస్ ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు ప్రారంభించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సదుపాయాల కల్పనకు కార్యాలయం ఉపయోగపడుతుందని ఎంపీలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment