సచివాలయంలో ఉద్యోగులు విధులు బహిష్కరణ | Telangana secretariat employees president Narendra Rao takes State Government | Sakshi
Sakshi News home page

సచివాలయంలో ఉద్యోగులు విధులు బహిష్కరణ

Published Thu, May 29 2014 11:42 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Telangana secretariat employees president Narendra Rao takes State Government

పోలవరంపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విధులు బహిష్కరిస్తున్నట్లు సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... ఇదే అంశంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కానున్నామని... అయితే ఆ సమావేశంతో లాభం జరుగుతుందని తాము భావించడం లేదని అన్నారు.

 

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు స్థానికేతరులుగా చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై  ఫిర్యాదు చేసిన ప్రభుత్వం మాత్రం స్పందించడంలేదని విమర్శించారు. స్థానికేతరులను బలవంతంగా తెలంగాణంలోకి రుద్దితే ప్రతిఘటించక తప్పదని నరేంద్రరావు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement