సాక్షి, హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 3 నుంచి 23 వరకు హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం కేంద్రాల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే పదో షెడ్యూల్‌లో ఉ న్న ఈ వర్సిటీ సేవలు కావాలని ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం.. ఒప్పందం లేనిదే సేవలు అందించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం మెట్టు దిగక పోవడంతో వివాదం జఠిలమైంది. స్వయంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ జోక్యం చేసుకున్నా పరి ష్కారం లభించలేదు.
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో ఏదో ఒక స్పష్టత వచ్చే వరకు పరీక్షల నిర్వహణను నిలిపివేయాలని వర్సిటీ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. దూర విద్య పరీక్షలను రెండు రాష్ట్రాల్లో వాయిదా వేస్తున్నట్లు, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ తోమాసయ్య సోమవారం తెలిపారు.
తెలుగు వర్సిటీ దూరవిద్య పరీక్షలు వాయిదా
Published Tue, Sep 1 2015 9:06 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM
Advertisement