గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచి కాంట్రాక్ట్ నర్సులు ఆందోళన చేస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆస్పత్రి భవనం పైకి ఎక్కి నిరసన తెలుపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని వారికి సర్దిచెప్తున్నారు.