tense situation
-
ఆందోళనలు, అరెస్టులు
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రులు బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనలతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో ఆందోళనకు దిగిన ఆప్ నేతలను పోలీసులు అరెస్ట్‌చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆప్, బీజేపీ ప్రధాన కార్యాలయాలు ఉన్న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ సమీప ఐటీఓ ఇంటర్సెక్షన్ కూడలి వద్దకు ఆప్ నేతలు, కార్యకర్తల పెద్ద సంఖ్యలో చేరుకుని మోదీ సర్కార్ వ్యతిరేక నినాదాలు చేశారు. ‘అరవింద్ మీరు సంఘర్షణను కొనసాగించండి. మేం మీకు తోడుగా ఉంటాం’ అని నినదించారు. ట్రాఫిక్ స్తంభించడంతో ధర్నాకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంచేశారు. అక్కడే ఆందోళనకు దిగిన ఢిల్లీ రాష్ట్ర మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో వేరే చోట్లకు తరలించారు. దీంతో తమ నేతలను విడుదలచేయాలంటూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలుచేశారు. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు పారామిలటరీ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించారు. ఐటీవో స్టేషన్‌ను సాయంత్రందాకా ఢిల్లీ మెట్రో రైల్ మూసేసింది. ఈడీ ప్రధాన కార్యాలయం, బీజేపీ ఆఫీస్‌ల వద్ద భారీగా బలగాలను మొహరించారు. ‘‘తప్పుడు కేసులతో నిన్న సీఎంను అరెస్ట్‌చేశారు. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే’’ అంటూ మంత్రులు ఆతిశీ, సౌరభ్ మండిపడ్డారు. కస్టడీలో కేజ్రీవాల్‌కు రక్షణేది: ఆతిషి ధర్నాకు ముందు మంత్రి ఆతిషి పత్రికాసమావేశంలో మాట్లాడారు. ‘‘సీఎం హోదాలో కేజ్రీవాల్ చుట్టూ నిరంతరం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఈడీ కస్టడీలో కేంద్రం ఆయనకు అంతటి భద్రత కల్పిస్తోందా? ఆయన భద్రతకు జవాబుదారీ ఎవరు? ఈడీ ఆఫీస్ లాకప్‌లోకి ఎవరెవరు వస్తున్నారు? అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లపై కేంద్రం ప్రకటన చేయాలి’ అని ఆతిషి డిమాండ్ చేశారు. -
సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సత్సంబంధాలు
న్యూఢిల్లీ: చైనాతో సత్సంబంధాలపై భారత్ మరోసారి స్పష్టతనిచ్చింది. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా ఆ దేశంతో సాధారణ సంబంధాలను సాగించడం వీలుకాదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దులకు అత్యంత సమీపంలో చైనా తన బలగాలను మోహరించడమే ప్రధాన సమస్య అని ఆయన గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చైనాతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భారత్ కూడా కోరుకుంటోందన్న ఆయన.. రెండు దేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొన్నప్పుడు మాత్రమే అలాంటిది సాధ్యమని పేర్కొన్నారు. చైనా ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని ఆ దేశానికి తెలియజేశామన్నారు. ఘర్షణలు, రెచ్చగొట్టే చర్యలు, తప్పుడు కథనాలు వంటి వాటికి భారత్ భయపడబోదన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ల పట్ల చైనాకు తన నిరసనను భారత్ పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఇరు దేశాలకు ఉందన్నారు. ‘ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న పరిస్థితులు చైనాకు కూడా ఏమంత మంచివికావు. సరిహద్దుల్లో పరిస్థితుల ప్రభావం ఇప్పటికే రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపింది..ఇంకా చూపుతోంది. సరిహద్దుల్లో ప్రశాంతత లేనప్పుడు సాధారణ సంబంధాలను ఆశించడం సరికాదు’అని జై శంకర్ అన్నారు. 2020 మేలో సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తినప్పుడు చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మీడియా ప్రస్తావించగా.. సరిహద్దులకు అత్యంత సమీపంలో రెండు దేశాల బలగాల మోహరింపే అసలైన సమస్య అని మంత్రి బదులిచ్చారు. సమస్య పరిష్కారానికి రెండు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. ‘సంబంధాలు మాత్రం తెగిపోలేదు. విషయం ఏమిటంటే..రెండు దశాబ్దాల్లోనే అత్యంత భీకరంగా 2020 జూన్‌లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. గల్వాన్ ఘర్షణల తర్వాత రోజు ఉదయం చైనా విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడాను కూడా. ఆ తర్వాత కూడా దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు సాగిస్తున్నాం. అయితే, చైనా మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఘర్షణలకు దిగుతోంది. అందుకే ఆ దేశంతో సంబంధాలు గాడినపడటం లేదు’అని వివరించారు. ఒక్క చైనాతో తప్ప అన్ని ముఖ్యమైన అన్ని దేశాలు, సమూహాలతో భారత్ సంబంధాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. -
బెంగాల్, మహారాష్ట్రల్లో ‘నవమి’ ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ/హౌరా: రామనవమి ఉత్సవాల సందర్భంగా పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగాల్‌లోని హౌరా నగరంలోని కాజీపారా ప్రాంతంలో గురువారం సాయంత్రం రామనవమి ర్యాలీ విషయమై రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. రెచ్చిపోయిన దుండగులు వాహనాలకు నిప్పుపెట్టారు. పలు ఆటోలు, దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కిరాద్‌పురా రామాలయం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణను నివారించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, ప్లాస్టిక్ బుల్లెట్లను ప్రయోగించడంతోపాటు కాల్పులు కూడా జరిపారు. సుమారు 500 మందితో కూడిన గుంపు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ సందర్భంగా 10 మంది పోలీసులు సహా 12 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి ఇదే ప్రాంతంలో సంఘ విద్రోహ శక్తులు 13 వాహనాలకు నిప్పుపెట్టాయి. రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురిలో శ్రీరామ్భగవాన్ ప్రతిమ యాత్రకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే, కొందరు నిషేధాజ్ఞలు ధిక్కరిస్తూ యాత్ర నిర్వహించారు. గత ఏడాది ఇక్కడే హనుమాన్ జయంతి వేడుక రోజు పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. గుజరాత్‌లోని వడోదరాలో రెండు రామనవమి ర్యాలీలపై దుండగులు రాళ్లు రువ్వారు. అయితే, ఎవరూ గాయపడలేదని పోలీసులు చెప్పారు. -
సెన్సెక్స్ తొలి నిరోధం 34,220
కోవిడ్ కేసులు పెరుగుతున్నా, ఇండో–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా, గతవారం పెద్ద ఎత్తున జరిగిన షార్ట్ కవరింగ్ ప్రభావంతో దేశీయ మార్కెట్ హఠాత్ ర్యాలీ జరిపింది. ప్రధాన కార్పొరేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుస పెట్టుబడుల ప్రవాహాన్ని ఆకర్షిస్తున్నతీరు, రూ.1,620 సమీపంలో ట్రిపుల్టాప్ను ఆ షేరు ఛేదించిన శైలిని పరిశీలిస్తే....ఈ జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపులోపు మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ షేరుకు సూచీల్లో వున్న అధిక వెయిటేజి కారణంగా మార్కెట్ర్యాలీ కూడా కొనసాగే ఛాన్సుంది. అలాగే గత శుక్రవారం వడ్డీ ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఆటో, రియాల్టీ షేర్లు కూడా ర్యాలీలో పాలుపంచుకున్నందున, అనూహ్య పరిణామాలేవీ చోటుచేసుకోకపోతే.... ఇప్పటికే బాగా పెరిగివున్న ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లు బలహీనంగా ట్రేడయినా, భారత్ సూచీలు మరికొంతశాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇక సాంకేతిక అంశాలకొస్తే.... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జూన్ 19తో ముగిసినవారం ప్రధమార్థంలో 32,923 పాయింట్ల వరకూ తగ్గిన బీఎస్ఈ సెన్సెక్స్...ద్వితీయార్థంలో జోరుగా ర్యాలీ సాగించి 34,848 పాయింట్ల గరిష్టస్థాయికి ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 951 పాయింట్ల భారీ లాభంతో 34,732 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అప్ట్రెడ్ కొనసాగితే సెన్సెక్స్ తొలుత 34,930 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. అటుపైన వేగంగా 35,260 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 35,920 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. సెన్సెక్స్ ఈ ఏడాది జనవరి20న సాధించిన 42,274 పాయింట్ల రికార్డు గరిష్టం నుంచి మార్చి 24 నాటి 25,639 పాయింట్ల కనిష్టస్థాయివరకూ జరిగిన పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 35,920 పాయింట్ల వద్ద రానున్న రోజుల్లో సెన్సెక్స్‌కు గట్టి అవరోధం కలగవచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే రానున్న కొద్దిరోజుల్లో 36,950 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఈ వారం తొలి అవరోధస్థాయిని అధిగమించలేకపోయినా, బలహీనంగా మొదలైనా 34,135 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 33,370 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున తిరిగి 32,920 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ తొలి నిరోధం 10,330 గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ అనూహ్యంగా 10,272 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపి. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 272 పాయింట్ల లాభంతో 10,244 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగాలంటే నిఫ్టీ 10,330 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. ఈ స్థాయిని దాటితే 61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 10,550 పాయింట్ల వరకూ ర్యాలీ జరిగే ఛాన్స్ వుంటుంది. ఈ స్థాయి వద్ద ఎదురుకాబోయే గట్టి నిరోధాన్ని సైతం అధిగమిస్తే క్రమేపీ 10,750 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, బలహీనంగా మొదలైనా 10,070 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 9,845 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 9,725 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
ఇండో–చైనా సరిహద్దులో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తూర్పు లద్దాఖ్, ఉత్తర సిక్కింలోని నకూ లా పాస్ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారని భారత సైన్యాధికారులు ఆదివారం వెల్లడించారు. తొలి ఘటనలో.. మే 5న సాయంత్రం తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది బాహాబాహీకి దిగడంతోపాటు, రెండు వైపులా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. కొన్ని గంటల పాటు ఈ ఘర్షణ కొనసాగింది. చర్చల అనంతరం మర్నాడు ఉదయానికి అది ముగిసింది. ఈ గొడవలో ఇరుదేశాల సైనికులు గాయపడ్డారు. ఓ సమయంలో ఉద్రిక్తత పెరగడంతో రెండు దేశాలు మరిన్ని దళాలను ఆ ప్రాంతానికి తరలించాయి. ఈ ఘర్షణలో ఎంతమంది భారతీయ సైనికులు గాయపడ్డారనే వివరాలను అధికారులు ఇవ్వలేదు. మరో ఘటనలో.. సిక్కింలోని నకూ లా పాస్ వద్ద ఇరుదేశాలకు చెందిన సుమారు 150 మంది సైనికులు బాహాబాహీకి దిగి పిడిగుద్దులతో ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ఈ ఘటనలో 10 మంది భారతీయ సైనికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. స్థానిక స్థాయి చర్చల అనంతరం ఇరువర్గాలు వెనక్కు తగ్గాయన్నారు. ‘సరిహద్దు సమస్య తేలకపోవడంతో ఇరు దేశాల సైనికుల మధ్య ఈ ప్రాంతాల్లో తాత్కాలిక, చిన్నస్థాయి ఘర్షణలు సాధారణమే. సిబ్బంది ఆవేశపూరిత మనస్తత్వం వల్ల కూడా ఘర్షణలు చోటు చేసుకుంటాయి. చిన్నపాటి గాయాలతో ముగుస్తాయి’ అని వివరించారు. భారత్, చైనాల మధ్య 2017లో డోక్లాం ట్రై జంక్షన్ వద్ద 73 రోజుల పాటు యుద్ధం స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవ నియంత్రణ రేఖగా పేర్కొనే 3,488 కి.మీ. పొడవైన సరిహద్దుపై వివాదం కొనసాగుతోంది. ఐబీజీలు సిద్ధం : ఆర్మీ చీఫ్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ‘సమగ్ర యుద్ధ బృందాలు (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్–ఐబీజీ)’ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని, కరోనా కారణంగా దీని అమలును కొంతకాలం వాయిదా వేశామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె తెలిపారు. యుద్ధ సామర్థ్యాలను పెంచుకునే దిశగా ప్రయోగాత్మకంగా పదాతి దళం, శతఘ్ని దళం, వైమానిక దళం, లాజిస్టిక్ యూనిట్స్‌లతో ‘ఐబీజీ’లను ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది సిబ్బంది ఉండే ప్రతీ ఐబీజీకి ఒక మేజర్ జనరల్ నేతృత్వం వహిస్తారు. ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారు సుశిక్షితులై ఉంటారు. ముఖ్యంగా పాక్, చైనా సరిహద్దుల్లో వీటిని మోహరించాలని ప్రణాళిక రచించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనకు ముందు ప్రయోగాత్మకంగా ఐబీజీల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించారు. -
పెదగొట్టిపాడులో మళ్లీ ఉద్రిక్తత
ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బుధవారం ‘ఛలో గొట్టిపాడు’కు పిలుపునిచ్చిన సీపీఐ, సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నేతలు ఉదయానికే ప్రత్తిపాడు చేరుకున్నారు. అప్పటికే బలగాలతో సిద్ధంగా ఉన్న పోలీసులు వీరిని అడుగడుగునా అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు బలవంతంగా వ్యానులోకి ఈడ్చేశారు. విషయం తెలుసుకున్న పెదగొట్టిపాడులో దళిత మహిళలు స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం విగ్రహాన్ని నీటితో శుద్ధి పరిచారు. తొలుత గ్రామం చుట్టూ పోలీసులు తొమ్మిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీ చేశాకే వాహనాలను గ్రామంలోకి అనుమతించారు. గుంటూరు, ప్రత్తిపాడు: పెదగొట్టిపాడులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ నెల ఒకటిన గ్రామంలోని ఇరువర్గాలకు మధ్య ఘర్షణ జరగడం, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇరువర్గాలతో చర్చలు జరిపి శాంతి కమిటీలు ఏర్పాటు చేయడంతో ఇరవై రోజులుగా గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం ఛలో గొట్టిపాడుతో గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమను పరామర్శించేందుకు వస్తున్న సీపీఐ, సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పెదగొట్టిపాడు దళితవాడలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట మహిళలు బైఠాయించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ అంబేడ్కర్ విగ్రహాన్ని నీటితో కడిగి శుద్ధి చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, అవతలి వర్గం నుంచి తమకు రక్షణ కల్పించాలి, ఘర్షణలో అసలైన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన డీఎస్పీ మూర్తి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎలాంటి అపోహలకు తావులేదని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. డీఎస్పీలు రమేష్‌కుమార్, ఆర్వీఎస్ఎన్ మూర్తిల ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడుగడుగునా విస్తృత తనిఖీలు.. చలో గొట్టిపాడు నేపథ్యంలో పోలీసులు ప్రత్తిపాడు, గొట్టిపాడులకు వచ్చే అన్ని మార్గాలనూ జల్లెడ పట్టారు. మొత్తం తొమ్మిది చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన వచ్చే, పోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఆధార్ కార్డు, గుర్తింపు కార్డుల ఆధారంగా వారిని గ్రామాల్లోకి అనుమతించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ద్విచక్రవాహనాలపై వెళ్లే వారిని సైతం వదల్లేదు. గొట్టిపాడు వెళ్లేందుకు అవకాశం ఉన్న పొలాల గట్లపైనా పోలీసులు గస్తీ నిర్వహించారు. జిల్లా అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు ప్రత్తిపాడు, గొట్టిపాడు, ఉన్నవ, బోయపాలెం, జాతీయ రహదారిపై బందోబస్తును పర్యవేక్షించారు. అడిషనల్ ఎస్పీలు వైటీ నాయుడు, సుబ్బరాయుడులు పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు.. చలో గొట్టిపాడును నిర్వీర్యం చేసేందుకు అడుగడుగునా ముందస్తు అరెస్టులు చేశారు. ప్రత్తిపాడులో సీపీఐ మండల అధ్యక్షుడు రామిశెట్టి ఆదేశ్వరరావు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఆదినారాయణ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవలి సుబ్బారావు, సీపీఎం మాజీ ప్రత్తిపాడు కార్యదర్శి రాజుపాలెం కోటేశ్వరరావును ప్రత్తిపాడులో, వ్యవసాయకార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి కారుచోల రోశయ్యను తూర్పుపాలెంలో, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్ కొరివి వినయ్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు వైకె, శాంతకుమార్లను తిక్కిరెడ్డిపాలెంలో.. ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తిక్కిరెడ్డిపాలెం బ స్టాండు వద్ద, స్పందన సూ ్టడియో ఎదుట, పాతమల్లాయపాలెం కూడలిల్లో ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ ల నాయకులు రోడ్లపై బైఠాయించి తమ నిరసనలను తెలిపేందుకు ప్రయత్నించా రు. వీరి కార్యక్రమాలను పోలీసులు భగ్నం చేశారు. నేతల అరెస్టులు పట్నంబజారుః చలో గొట్టిపాడుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వామపక్షాల నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. సీపీఎం, సీపీఐ, దళిత, ప్రజా సంఘాల నేతలను అరెస్టులు చేసి గుంటూరు నగరంతో పాటు రూరల్ పోలీసుస్టేషన్లకు తరలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను ప్రత్తిపాడులో అరెస్టు చేసి ముందుగా పట్టాభిపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి తిరిగి నగరంపాలెం పోలీసుస్టేషన్ పంపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా కార్యదర్శి పాశం రామారావులతో పాటు మరికొంత మంది నేతలను నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, బలహీనవర్గాల జే ఏసీ నేత వైవీ సురేష్‌తో పాటు విజయవాడ నుంచి వచ్చిన దళిత సంఘాల నేతలను పాతగుంటూరు పోలీసుస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని నగరంపాలెం, పట్టాభిపురం, అరండల్‌పేట, పాతగుంటూరు, లాలాపేట పోలీసుస్టేషన్లో పాటు వామపక్షాల అనుబంధ విభాగాల నేతలు పలువురిని సీసీఎస్‌కు తరలించారు. ఆయా ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన వామపక్షాలు, దళిత, ప్రజా సంఘాల నేతలను సాయంత్రం వరకు స్టేషన్లలోనే ఉంచారు. 100 మంది వరకు ఆయా స్టేషన్లోనే ఉంచి, సొంతత పూచీకత్తులపై విడిచి పెట్టారు. అగ్రకులాల కొమ్ము కాస్తున్న ప్రభుత్వం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొరిటెపాడు(గుంటూరు):రాష్ట్ర ప్రభుత్వం అగ్రకులాలకు కొమ్ముకాస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. నగరంపాలెం పోలీసుస్టేషన్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గొట్టిపాడులో దళితులపై దాడి చేసినా ఏ మాత్రం స్పందించకుండా మౌనంగా ఉండటం దారుణమన్నారు. కేసులను నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతోందని ద్వజమెత్తారు. ఒకవైపు దళితులపై దాడులు చేయిస్తూనే మరో వైపు ఈ నెల 26 నుంచి దళిత తేజం పేరిట కార్యక్రమాలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేయడం బాధాకరమన్నారు. గొట్టిపాడులో దళితులను పరామర్శించడానికి వెళుతున్న తమను ఎందుకు పోలీసులు అడ్డుకున్నారో తెలియడం లేదన్నారు. దళితులను పరిరక్షించాల్సిన ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ దళితులకు అన్యాయం చేస్తుందన్నారు. -
గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్తత
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచి కాంట్రాక్ట్ నర్సులు ఆందోళన చేస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆస్పత్రి భవనం పైకి ఎక్కి నిరసన తెలుపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని వారికి సర్దిచెప్తున్నారు. -
డ్రగ్స్‌లో పేలుడు.. పరిస్థితి ఉద్రిక్తం
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు కంపెనీ వద్ద కార్మికుల ఆందోళన రూ. 26 లక్షల ఎక్స్‌గ్రేషియాకు యాజమాన్యం అంగీకారం నక్కపల్లి: మండలంలోని హెటిరో డ్రగ్స్ కంపెనీలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా, ఇ ద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పాత ఇనుప తుక్కు నిల్వ చేసే గోదాం వద్ద ఒక డ్రమ్మును కట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ప్రమాదంలో నక్కపల్లికి చెందిన టీకాయల అప్పారావు(35) అనే కార్మికు డు అక్కడక్కడే మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన ఏనుగుపల్లి సిం హాచలం, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ గాయపడ్డారు. వీరిని విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో నేలపై కెమికల్స్ ఉండటంవల్ల నిప్పురవ్వలు పడి పేలుడు సంభవించినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలం నుంచి అప్పారావు మృతదేహాన్ని, క్షతగాత్రులను హుటాహుటిన వేరొక ప్రాంతానికి తరలించడంపై వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయుకులతో కలసి కంపెనీ ముందు ఆందోళకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వీసం రామకృష్ణ, మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ తదితరులు కంపెనీ వద్దకు వెళ్లి ప్రమాదం వివరాలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు చెప్పకుండా మృతదేహాన్ని, క్షతగాత్రులను ఎందుకు తరలించారని యాజమాన్యాన్ని నిలదీశారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యలమంచిలి సీఐ వెంకటరావు, కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అప్పారావుకు భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. క్షతాగాత్రుడు సింహచలంది అదే పరిస్థితి. ఇద్దరూ నక్కపల్లి ఎస్సీకాలనీకి చెందిన వారు కావడంతో కాలనీ వాసులు కంపెనీ ముందు అధిక సంఖ్యలో గుమికూడారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు ఆందోళన కొన సాగిస్తామని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. అప్పారావు మృత దేహాన్ని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్త్నుట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.26 లక్షలు కర్మాగారంలో జరిగిన సంఘటనలో మృతుడి కుటుంబానికి రూ.26లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. అదే విధంగా క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో చికిత్స ఖర్చు భరించేందుకు నిర్ణయం తీసుకుంది. -
నెల్లూరు చల్లబడింది..
ఆందోళనకారులతో ఫలించిన అధికారుల చర్చలు నెల్లూరు ఒకటోనగర ఇన్స్పెక్టర్పై బదిలీవేటు ఎస్పీ, డీఎస్పీలపై ప్రభుత్వానికి నివేదిక నెల్లూరు(క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత సడలింది. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ఓ వర్గానికి చెందిన ప్రజలతో ఆదివారం జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలీకృతమయ్యాయి. దీంతో ఆ వర్గానికి చెందిన ప్రజలు శాంతించారు. దీంతో రెండురోజులగా నెలకొన్న ఉద్రిక్తత సద్దుమణిగింది. జిల్లా ఎస్పీ డాక్టర్ గజరావుభూపాల్ తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వర్గానికి చెందిన ప్రజలు శనివారం రాత్రి ఆందోళనకు దిగిన విషయం విదితమే. దీంతో క్షమాపణ చెప్పేందుకు పోలీసుస్టేషన్‌కు వస్తున్న ఎస్పీ వాహనంపై ఓ వర్గానికి చెందిన యువకులు దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం ఎస్పీ గన్‌మన్ గాలిలో కాల్పులు జరిపి ఎస్పీని సంఘటన స్థలం నుంచి తీసుకెళ్లిపోయారు. గుంటూరు రేంజ్ ఐజీ ఎన్ సంజయ్ ఆదివారం తెల్లవారుజామున నెల్లూరుకు చేరుకుని సంఘటనకు దారితీసిన పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ జానకితో మాట్లాడి ఉద్రిక్తత పరిస్థితులను తొలగించేందుకు తీసుకోవాల్చిన చర్యలపై చర్చించారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీకాంత్ జిల్లాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్పీపై చర్యలకు డిమాండ్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం ఉదయం 11 గంటలకు ఆ వర్గానికి చెందిన వారు నెల్లూరు జెండావీధిలోని ఒక భవనంలో సమావేశమయ్యారు. దీంతో పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. ఆందోళనకారులు వందల సంఖ్యలో ఆ భవనం వద్దకు చేరుకుని ఎస్పీని సస్పెండ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఆందోళన చేస్తున్న వర్గానికి చెందిన ప్రతినిధులతో ఐజీ, కలెక్టర్, ప్రకాశం జిల్లా ఎస్పీ, జేసీ ఇంతియాజ్‌తో పాటు పలువురు అధికారులు చర్చలు జరిపారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్పీ, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలనీ, కేసులు ఎత్తివేయాలని ఆ వర్గం నేతలు డిమాండ్ చేశారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించారు. ఒకటో నగర ఇన్స్పెక్టర్ కె.నరసింహరావును తక్షణమే బదిలీ చేస్తున్నట్లు ఐజీ ప్రకటించారు. ఎస్పీపై చర్యలు తీసుకునే విషయం అధికారులు దాటవేయడంతో తిరిగి ఆ వర్గం వారు పోలీసు కవాతు మైదా నం బయట ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి మొదటికొచ్చే అవకాశం ఉందని భావించిన ఐజీ, కలెక్టర్లు ఆందోళనకారుల వద్దకు చేరుకుని వారికి సర్దిచెప్పారు. ఘటన దురదృష్టకరం ఓ వర్గానికి చెందిన ప్రజలు అపార్థం చేసుకోవడం వల్లనే పరిస్థితి అదుపుతప్పిందని, ఇలాంటి ఘటన నెల్లూరులో చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఐజీ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ, డీఎస్పీలపై ప్రభుత్వానికి, డీజీపీకి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. సమస్య సద్దుమణిగిన తర్వాత ఐజీ, కలెక్టర్, నగర మేయర్ అజీజ్, ఆ వర్గ ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. శాంతి ర్యాలీలో పాల్గొన్న గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్, నెల్లూరు కలెక్టర్ జానకి, మేయర్ అజీజ్ తదితరులు. -
కన్నీళ్లే కన్నెర్ర చేస్తే..
కర్నూలు: అభం శుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని వారు తట్టుకోలేక పోయారు. దాడికి పాల్పడిన మానవ మృగాన్ని తామే చంపేస్తామంటూ పాతబస్తి వాసులు ఒక్కటై కదలివచ్చారు. కర్నూలు పెద్దాసుపత్రి ఆవరణలోని పోలీసు సదన్‌లో చికిత్స పొందుతున్న నిందితుడిని అంతు చూస్తామంటూ సోమవారం రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఆసుపత్రి ఎదురుగా గంట పాటు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సార్... మాకు ఐదు నిమిషాలు అవకాశమివ్వండి... ఆ మానవ మృగాన్ని చంపేస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ఈ దశలో ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. పాతబస్తీ వాసులకు బీజేపీ నాయకులు హరీష్ బాబు, రంగస్వామి, హేమలత, కాంగ్రెస్ నాయకులు పద్మావతి తదితరులు మద్దతు తెలిపారు. రాస్తారోకో అనంతరం ఒక్క ఉదుటున వందల సంఖ్యలో యువకులు నిందితుడు చికిత్స పొందుతున్న పోలీస్ సదన్ వద్దకు పరుగులు తీశారు. దీంతో ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు రంగనాయకులు, ప్రవీణ్‌కుమార్, బాబుప్రసాద్, రామకృష్ణ తమ సిబ్బందితో ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో మళ్లీ ఆందోళనకారులు ఆసుపత్రి ఎదుట రహదారిపై ఆందోళన చేశారు. నిందితుడిని ఉరి తీసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం అక్కడి నుంచి రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వీరికి వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు హఫీజ్‌ఖాన్ మద్దతు తెలిపారు. -
ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత!
-
ఓయూలో ఆమరణ దీక్షలు
క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యం నిరసన ర్యాలీలు... ఉద్రిక్తత హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు, నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు.. సీఎం దిష్టిబొమ్మ దహనం...పోలీసుల జోక్యంతో బుధవారం క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయవద్దని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, టీపీపీఎస్సీ ద్వారానే పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొన్న ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ దీక్షలకు మద్దతుగా యూనివర్సిటీ లైబ్రరీని బహిష్కరించిన వందలాది మంది విద్యార్థులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ ప్రదర్శనతో ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఓయూ పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు ముళ్ల కంచెను, బారికేడ్లను అడ్డంగా పెట్టి ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీ.విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు కోటూరి మానవతారాయ్, చైర్మన్ కళ్యాణ్ మాట్లాడుతూ మూడు, నాలుగు తరగతుల మినహా ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తే సహించబోమని హెచ్చరించారు. -
శాంతిభద్రతలపై చర్చ.. సభలో తీవ్ర ఉద్రిక్తత
రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభలో లేని వ్యక్తులపై అభాండాలు వేయడం ఏమిటంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై టీడీపీ సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌ను దీనిపై రూలింగ్ ఇవ్వాలని కోరినా.. స్పీకర్ పరిశీలించి రూలింగ్ ఇస్తారంటూ ఆయన మళ్లీ టీడీపీ సభ్యులకు అవకాశం ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియంలోకి వచ్చి నినాదాలు చేశారు. సభలో లేని వ్యక్తులు, ఆరోపణలకు సమాధానం ఇవ్వలేని వ్యక్తుల మీద అసెంబ్లీలో ఎలాంటి ఆరోపణలు చేయకూడదని అసెంబ్లీ నియమ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని, దీనిపై రూలింగ్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీకి చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి నిబంధనను ప్రస్తావిస్తూ డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. అయినా మళ్లీ మళ్లీ టీడీపీ సభ్యులకు అవకాశం రావడం, వాళ్లు మళ్లీ మళ్లీ ఆరోపణలు చేయడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చారు. అయినా కూడా స్పీకర్ నిబంధనలను పరిశీలించి ఆ తర్వాత రూలింగ్ ఇస్తారని, అప్పటివరకు కూర్చోవాలని డిప్యూటీ స్పీకర్ అన్నారు. మరోవైపు బొండా ఉమామహేశ్వరరావుకు, ధూళిపాళ్ల నరేంద్రకు మాత్రం మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ధూళిపాళ్ల నరేంద్ర నిబంధనలను చదువుతుండగా పోడియం వద్దకు వైఎస్ఆర్సీపీ సభ్యురాలు రోజా రాగా, ఆమెపై నరేంద్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.