భూగర్భ కేబులింగ్ కోసం తీసిన గోతిలో ప్రమాదవశాత్తు ఓ కారు పడింది.
భూగర్భ కేబులింగ్ కోసం తీసిన గోతిలో ప్రమాదవశాత్తు ఓ కారు పడింది. నగరంలోని యూసుఫ్‌గూడ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా 33 కేవీ భూగర్భ కేబుల్ వేయడానికి తీసిన గుంత సమీపంలో ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడంతో.. అటు నుంచి వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అందులోపడింది. సిద్ధార్థ నగర్ నుంచి యూసుఫ్‌గూడాకు కారులో వెళ్తున్న రామకృష్ణ ప్రధానకూడలి వద్దకు రాగానే ఎదురుగా మరో వాహనం వస్తుండటంతో దాన్ని తప్పించడానికి ప్రయత్నించే క్రమంలో ఎడమ వైపు ఉన్న గుంతలో పడింది. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని బయటకు తీశారు. స్వల్పగాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి త రలించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.