
అమరావతి నిర్మాణానికి కొత్త విధానం
కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కొత్త విధానం తీసుకొచ్చామని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణంపై అధ్యయనం చేయకుండా అనుమతులు ఇచ్చారన్న విషయంలో వాస్తవం లేదన్నారు.
అమరావతి నిర్మాణానికి కొత్త పాలసీ తెచ్చామనీ, అటవీ భూముల్లోనూ నివాస, వాణిజ్య సదుపాయాలను నిర్మించేందుకు అనుమతిచ్చామని తెలిపారు. అమరావతి నిర్మాణంపై కేంద్రం ఇచ్చిన మినహాయింపు ఈ కొత్త పాలసీ ఒక్కటేనన్నారు. అనుమతుల విషయంలో జాప్యమేమీ లేదనీ పూర్తి అనుమతులు వస్తాయన్నారు. అయితే రాజధాని నిర్మాణానికి తక్కువ అటవీ భూములు ఉపయోగించాలనీ, అడవులను పరిరక్షించేలా అమరావతిని డిజైన్ చేయాలని మంత్రి పేర్కొన్నారు.