కార్మిక శాఖకు కోతలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక శాఖను ప్రభుత్వం నిరాశపరిచింది. గత బడ్జెట్‌తో పోల్చితే భారీగా కోత విధించింది. గత బడ్జెట్‌లో కింద రూ.70 కోట్లు ప్రకటించగా, ఈసారి 36.53 కోట్లతో సరిపెట్టింది. మొత్తం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద రూ.425.32 కోట్లు కేటాయించింది. కార్మికుల బీమా వైద్య సదుపాయాలకు ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు.
ఉపాధి శిక్షణకు పెద్దపీట..
ఉన్నంతలో ఉపాధి శిక్షణ విభాగానికి కాస్త పెద్దపీట వేసింది. ఇటీవల యువతకు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అలాగే విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయాల్లో కూడా ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తోంది. దీంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.26.17 కోట్లు కేటాయించింది.