టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి ఎంపీ కవిత
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ కవిత అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కవిత మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ ప్రముఖ స్థానంలో ఉందన్నారు. సిటీ సింగపూర్, దుబాయ్‌లతో సమానమన్నారు. గత పాలకులు నగరాభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే నగరంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ లోపంతో ముంపు ముప్పు పొంచి ఉందన్నారు.
నగరంలోని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. సిటీలో 54 జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్థల్లో అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జేఏసీ గ్రేటర్ చైర్మన్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎం.నర్సయ్య, ప్రొఫెసర్ ఎ.వినయ్ బాబు, ఎర్రోజు శ్రీనివాస్, కిషోర్ రెడ్డి, డాక్టర్ జయంతి పాల్గొన్నారు.