హక్కు పత్రం.. మీ సొంతం
బస్తీ పేదలకు వరం స్థలాల క్రమబద్ధీకరణతో పాటు పక్కా ఇల్లు అటు పేదలకు సదుపాయం .. ఇటు స్లమ్ ఫ్రీ సిటీ మౌలిక సౌకర్యాలకూ ప్రాధాన్యం ఇదీ సర్కారు యోచన
సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో 125 చ.గ.లోపు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న వారికిఉచితంగా క్రమబద్ధీకరణ చేయాలని భావిస్తోన్న ప్రభుత్వం.. మురికివాడల ప్రజలకు ఉచిత క్రమబద్ధీకరణతో పాటు రెండు పడక గదుల ఇళ్లు.. మౌలిక సదుపాయాలు కల్పించాలని యోచిస్తోంది. అందులో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్‌లైన్లు, వీధి దీపాలు, పార్కులు, విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాల వంటి సదుపాయాల కల్పనకు అవసరమైన స్థలాన్ని కేటాయించి... మిగిలిన ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని యోచిస్తోంది. ఇళ్ల నిర్మాణాలకు ముందుగానే 125 చ.గ.లోపు స్థలాల్లోని పేదలకు ‘హౌస్ రైట్ సర్టిఫికెట్’ (ఇంటి హక్కు పత్రం) ఇవ్వాలని భావిస్తోంది. ఈ సర్టిఫికెట్ ఉన్న వారికి రెండు పడకగదుల నివాస గృహం కేటాయిస్తారు. 20-30 చ.గ . వరకు ఉన్న వారి స్థలాన్ని విభజించకుండా అలాగే ఉంచాలని భావిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కమిటీలు వేసి, అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరణ.. టీఆర్‌ఎస్ హామీ మేరకు రెండు పడకగదుల ఇళ్లు.. మౌలిక సదుపాయాల కల్పనతో స్లమ్‌ఫ్రీ సిటీ.. ఒకేసారి కార్యరూపం దాల్చగలవని అంచనా వేస్తోంది. మురికివాడల్లోని వారు ఉంటున్న స్థలం మేరకు పట్టాలిస్తే.. మౌలిక సదుపాయాలకు చోటు దొరకదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలకు స్థలాన్ని కేటాయించాక... మిగిలిన ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆ దిశగా ఇప్పటికే సర్వే నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సర్వేలో వెల్లడైన వివరాలు ఇవీ...
మొత్తం మురికివాడలు 1468
ప్రభుత్వ భూముల లోనివి 757
ప్రైవేట్ భూముల లోనివి 711
స్లమ్స్‌లో జనాభా 17.61 లక్షలు
స్లమ్స్‌ను దిగువ అంశాల వారీగా వర్గీకరించారు..
జనసాంద్రత ఎక్కువగా ఉన్నవి
ఇరుకు వీధులు {పమాదకర భవనాలు ఎక్కువ సంఖ్యలో భవనాలు {yైనేజీ, తాగునీటి పైప్‌లైన్లు వేసేందుకు వీలు లేనివి
72 స్లమ్స్‌లో నమూనా సర్వేలో వెలుగు చూసిన అంశాలివీ... 48 బస్తీలు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయి. వీటిల్లో 39 ప్రాంతాల్లో ప్రజలు 60 చ.గ.లోపునే ఉన్నారు. 20 చ.గ.లోపు ఇళ్లలో ఉంటున్న వారూ వీరిలో ఉన్నారు. తొమ్మిది కేసుల్లో మాత్రం దాదాపు 100 చ.గ. స్థలంలో ఉంటున్నారు. అనేక చోట్ల మౌలిక సదుపాయాలు లేవు.
ఈ నేపథ్యంలో ప్రజలకు వారి పేరిట ధ్రువపత్రాలు ఇచ్చినపుడే బస్తీలనుఅభివృద్ధి చేయాలని, మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.చెరువు కట్టలు, నాలాల ఒడ్డున ఉండే వారికి వేరే చోట స్థలం/ ఇల్లు కేటాయించాలనేది యోచన. స్లమ్స్‌కు కూడా తగిన లేఔట్‌లు రూపొందించి అభివృద్ధి చేయనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారి లేఔట్లలోని నిబంధనలను అమలు చేస్తూ, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిదీపాల వంటి వాటికి స్థలం కేటాయిస్తారు. స్లమ్స్‌లోని ప్రధాన మార్గంలో రహదారి కనీసం 30 అడుగులు, అంతర్గత రహదారులు కనీసం 20 అడుగుల వెడల్పునకు తగ్గకుండా చర్యలు తీసుకుంటారు.200 చ.గ. ఖాళీ స్థలాలు ఉన్న ప్రదేశాల్లో 50 నివాసాలకు మించకుండా, 400 చ.గ. ప్రదేశాల్లో 50కిపైగా నివాసాలు ఉండాలని ప్రాథమిక అంచనా. నివాస గృహం కనీస వెడల్పు 12 అడుగులు.
సర్వే మేరకు.. బస్తీల్లోని ప్లాట్ల విస్తీర్ణం సగటున ఇలా...
ప్లాట్ల విస్తీర్ణం (చదరపు గజాల్లో) ..
మొత్తం మురికివాడలు 757
25 చ.గ.లోపు 65 (8.59 శాతం)
26-50 చ.గ.లోపు 267 (35.27శాతం)
51-75 చ.గ.లోపు 2634 (34.74శాతం)
76-125 చ.గ.లోపు 158 (20.87శాతం)
125 చ.గ.లపైన 4 (0.53 శాతం)
రోడ్ల వెడల్పు...
రోడ్ల వెడల్పు స్లమ్స్ శాతం
20 అడుగుల కంటే ఎక్కువ 363 47.95
10-19 అడుగులు 300 39.63
10 అడుగుల లోపు 94 12.42
స్లమ్స్‌లోని ఇళ్లలో నూరు శాతం పక్కా ఇళ్లు 162 ఉండగా, సెమీ పక్కా, కచ్చా ఇళ్లు 595 ఉన్నాయి.
ఇళ్ల కేటాయింపు ప్రతిపాదనలివీ...
మురికివాడల్లో రహదారులు ఇతరత్రా సదుపాయలతో పాటు విస్తీర్ణాన్ని నాలుగు ప్రతిపాదనులు సిద్ధం చేసినట్టు సమాచారం.
మోడల్ 1 : ప్లాట్ విస్తీర్ణం 60 చ.గ . లోపు వారికి దీన్ని వర్తింపజేస్తారు. వీరికి హౌస్ రైట్ సర్టిఫికెట్లు స్లమ్స్ ప్రభుత్వ భూముల్లో ఉండి, 75 శాతం కచ్చా ఇళ్లు, పాక్షిక పక్కా ఇళ్లు, రోడ్లు 8-10 అడుగుల లోపు ఉన్న ప్రాంతాలకు వర్తింపజేస్తారు. మొత్తం స్లమ్స్‌లో ఇలాంటివి 60 శాతం ఉంటాయని అంచనా.
మోడల్ 2 :రహదారులు, నివాసాలు మోడల్ 1 లాగే ఉన్నప్పటికీ, మార్కెట్ డిమాండ్ ఉండే ప్రైమ్ ఏరియా ప్రాంతాల్లో దీన్ని వర్తింపచేయాలనేది ఆలోచన. ఖాళీ ప్రదేశాల్లో కొంత భాగాన్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఇలాంటివి 15 శాతం ఉండవచ్చునని అంచనా.
మోడల్ 3: నివాసాలు 60 చ.గ.ల కన్నా ఎక్కువ ఉండి, 70 శాతానికి పైగా పక్కా ఇళ్లున్న ప్రదేశాల్లోని వారికి పట్టాలిస్తారు. ఇలాంటివి 15 శాతం ఉండవచ్చని అంచానా.
మోడల్ 4: ప్రమాదకర ప్రాంతాల్లోని(చెరువులు, నాలాల ఒడ్డున ఉండే) వారికి వేరే చోట ఇవ్వడం. ఇలాంటి స్లమ్స్ దాదాపు 10 శాతం ఉండవచ్చునని అంచనా.