Slum Free City
-
కొత్త కళ
మరో నాలుగు బస్తీల్లో డబుల్బెడ్రూమ్ ఇళ్లు పేదలకు సర్కారు దసరా కానుక నేడు శంకుస్థాపన సిటీబ్యూరో: స్లమ్ ఫ్రీ సిటీలో భాగంగా నగరంలో మరో నాలుగు బస్తీల్లోని ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ బోయిగూడ ఐడీహెచ్ కాలనీ తరహాలో గ్రేటర్‌లోని నాలుగు నియోజకవర్గాల పేదలకు దసరా కానుకగా ఇవి ప్రారంభం కానున్నాయి. ఈ ఇళ్లకు నేడు (గురువారం) శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, టి.పద్మారావు, మహేందర్‌రెడ్డి, కె.టి.రామారావులు వీటికి శంకుస్థాపనలు చేస్తారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షత వహించనున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ క్రాస్‌రోడ్స్ దగ్గర చిత్తారమ్మబస్తీ, సనత్‌నగర్ నియోజకవర్గంలోని హమాలీ బస్తీ, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చిలకలగూడ దోబీఘాట్, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ దగ్గరి ఎరుకల నాంచారమ్మ నగర్లలో ఈ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేశారు. బోయిగూడలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌కూ గురువారమే శంకుస్థాపన చేయనున్నారు. అందరికీ అవకాశం కల్పించాలని... రజకులు తదితరుల కోసం దోబీఘాట్లో ఇళ్లు నిర్మిస్తుండగా... మిగతా ప్రాంతాల్లో స్థానికంగా గుడిసెల్లో, చిన్నా చితకా ఇళ్లల్లో తలదాచుకుంటున్న వారి కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించనున్నారు. జ్లీపస్ 2 పద్ధతిలోనా లేక అంతకంటే ఎక్కువ అంతస్తుల్లోనా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లబ్ధిదారుల సంఖ్య, స్థానికుల నుంచి ఎదురేయ్యే అభ్యంతరాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని దీన్ని ఖరారు చేయనున్నారు. ఎక్కువ అంతస్తుల్లో ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే స్థానికంగా ఉంటున్న అందరికీ అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. త్వరలో ఐడీహెచ్ కాలనీ ప్రారంభం గత సంవత్సరం దసరా రోజున శంకుస్థాపన జరిగిన ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను గురువారం ప్రారంభించాలని తొలుత భావించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తుండటం.. పూర్తయిన ఇళ్లకు రంగులు, రహదారుల నిర్మాణం వంటివి పూర్తి కావాల్సి ఉండటంతో కొద్ది రోజుల తర్వాత ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చిలకలగూడ : చిలకలగూడ దోబీఘాట్ స్థలంలో సుమారు 200 ఇళ్ల నిర్మాణానికి గురువారం పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆబ్కారీ మంత్రి పద్మారావు బుధవారం రాత్రి దోబీఘాట్ స్థలాన్ని సందర్శించి హౌసింగ్, రెవెన్యూ అధికారులు, క్రాంతి రజక అభివృద్ధి సంఘం సభ్యులతో చర్చించారు. శంకుస్థాపన పనులను పరిశీలించారు. చిలకలగూడ దోబీఘాట్పై ఆధారపడి సుమారు 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఏళ్ల తరబడి సొంత ఇళ్లు లేక వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లకు మంత్రి పద్మారావు చొరవతో హౌసింగ్స్కీం అమలు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
పీపీపీ..ఇక హ్యాపీ!
- తెరపైకి కొత్త ప్రతిపాదనలు - పీపీపీ విధానంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు - హామీని నిలబెట్టుకునేందుకు యత్నాలు - ఖజానాపై భారం పడకుండా సర్కారు జాగ్రత్తలు సాక్షి, సిటీబ్యూరో: స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామన్న ప్రభుత్వం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఈ హామీని నిలబెట్టుకోవడంతో పాటు... అదే సమయంలో ఖజానాపై భారం పడకుండా చూడాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెస్తోంది. ఇకపై పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో ఈ ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా అటు ప్రజల వద్ద మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని...తమకు భారం తప్పుతుందని భావిస్తోంది. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇంతవరకూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెచ్చించే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఇది ఆర్థికంగా భారంగా మారుతుండడంతో కొత్త దారి వైపు చూస్తోంది. ఎస్సార్ నగర్‌తో శ్రీకారం తొలుత ఎస్సార్‌నగర్-అమీర్‌పేట మార్గంలోని ‘స్టేట్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్’ (ఎస్హెచ్టీఓ)కు చెందిన స్థలంలో ఈ విధానంలో పేదలకు డబుల్ బెడ్రూమ్, హాల్, వంటగది, రెండు మరుగుదొడ్లతో కూడిన ఇళ్లు నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి సమీపంలోని ఐడీహెచ్ కాలనీలో 396 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వం రూ.36.50 కోట్లు ఖర్చు చేస్తోంది. ఐమాక్స్ సమీపంలోని ఇందిరా నగర్లోనూ మరో 250 ఇళ్లకు దాదాపు రూ.26 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో ఐడీహెచ్ కాలనీలో జీప్లస్ టూ విధానంలో నిర్మిస్తున్నారు. ఇందిరానగర్‌లో జీప్లస్5 పద్ధతిలో కట్టేందుకు ప్రతిపాదిస్తున్నారు. నగరంలోని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేసేందుకు భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇకపై పీపీపీ పద్ధతిలో నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగైదు అంతస్తుల్లో పేదలకు అవసరమయ్యే ఇళ్లను లిఫ్ట్‌లతో పాటు సకల సదుపాయాలతో నిర్మించాలని యోచిస్తోంది. వీటి నిర్మాణ వ్యయాన్ని భరించే సంస్థకు మొత్తం బిల్టప్ ఏరియాలో దాదాపు 50 శాతం ఇవ్వాలనేది ప్రాథమిక యోచనగా తెలిసింది. తద్వారా ఇటు తమపై భారం తప్పడంతో పాటు అటు బిల్డర్‌కూ లాభసాటి గా ఉంటుందనే ఈ ప్రతిపాదనలకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారం పడకుండా... రాబోయే రెండేళ్లలో పేదల కోసం దాదాపు పదివేల ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం. నగర శివార్లలో... ఎక్కడో దూరంగా కాకుండా మంచి డిమాండ్ ఉన్న బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లోనూ పేదలకు ఇళ్లు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగానే ఆయా ప్రాంతాల్లో గృహాలు నిర్మిస్తున్నారు. పేదల ఇళ్ల కోసం ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. స్థల సమస్య తీరుతున్నప్పటికీ నిర్మాణ భారం తీవ్రమవుతోంది. పీపీపీ విధానంతో ప్రభుత్వంపై భారం లేకుండానే ఇళ్లను పూర్తి చేయవచ్చునని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అమీర్‌పేటలో ఎస్హెచ్టీఓకు చెందిన ఏడెకరాల స్థలాన్ని ఇటీవలే జీహెచ్ఎంసీకి బదలాయించారు. జీప్లస్ 3 విధానంలో కడితే ఎకరాకు వంద ఇళ్ల చొప్పున ఏడెకరాల్లో దాదాపు 700, జీప్లస్5 పద్ధతిలో అయితే వెయ్యికిపైగా ఇళ్లు నిర్మిం చగలరని అంచనా. దాదాపు 580 ఎస్ఎఫ్టీతో వీటిని నిర్మించనున్నారు. పేదల ఇళ ్లకోసం అవసరమైతే ఎకరాకు రూ.5 కోట్లయినా ఖర్చుచేసి భూమిని కొంటామని సీఎం చంద్రశేఖరరావు ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్ పర్యటనలో భాగంగా హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఖజానాపై భారం లేకుండానే ఎక్కువ మందికి గృహ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం పీపీపీ విధానానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
కొత్తకొత్తగా...
సాక్షి, సిటీబ్యూరో: స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగా నగరంలోని మురికివాడల స్థానే అందమైన కాలనీల నిర్మాణానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం... వీటిని త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయగలమని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. నిర్మాణ వ్యయం కొంత అధికమైనప్పటికీ, పనులు తొందరగా పూర్తవు తాయని... సమయం కలిసి వస్తుందని అంటున్నారు. స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగా తొలిదశలో మరో 12 బస్తీల్లో ఇళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. అందులో ఇప్పటికే 8 బస్తీలను ఎంపిక చేసినట్లు తెలిసింది. రూ.500 కోట్లతో పనులు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రస్తుత, కొత్త ఆర్థిక సంవత్సరాలకు జీహెచ్ఎంసీకి ప్రభుత్వం రూ.250 కోట్ల వంతున (మొత్తం రూ.500 కోట్లు) మంజూరు చేసింది. ఈ నిధులతో పేదలకు డబుల్ బెడ్రూమ్, డబుల్ టాయ్‌లెట్, హాల్, కిచెన్లతో కూడిన ఇళ్లను నిర్మిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. వీటితో పాటేరహదారులు, పార్కులు, షాపింగ్‌కాంప్లెక్స్‌లు, కమ్యూనిటీ హాళ్లు, ఆటస్థలాల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తొలి దశలో 12 బస్తీల్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. కూకట్‌పల్లిలోని అమ్రునగర్ తండాలో ప్రయోగాత్మకంగా తొలి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. తొలి ప్రాధాన్యం వారికే... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కావడంతో ఆ వర్గాలు అధిక సంఖ్యలో ఉన్న బస్తీలను ఎంపిక చేశారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ. 6 లక్షలు ఖర్చు కాగలదని తొలుత అంచనా వేశారు. రహదారులు, పార్కులు, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలతో కలిపి ఐడీహెచ్ కాలనీలో ఒక్కో ఇంటికి ప్రస్తుతం రూ.9.20 లక్షల వంతున ఖర్చవుతోంది. దీని కంటే వ్యయం కాస్త అధికమైనా సమయం, నాణ్యత ఉంటాయని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఆకట్టుకునేలా... తొలి దశలో నిర్మించే ఈ ఇళ్లను చూసి మిగతా బస్తీల్లోని ప్రజలు ఆసక్తి చూపేలా నిర్మాణం... సదుపాయాలు ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టే చోట స్థానికులను ఒప్పించేందుకు అధికారులు తిప్పలు పడాల్సి వస్తోంది. తక్కువ విస్తీర్ణం, సదుపాయాలు లేనప్పటికీ... తమకు ప్రత్యేకంగా ఉండాలని... అపార్ట్మెం ట్లు వద్దని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తొలిదశ ఇళ్లను చూసిన తరువాత వారి అభిప్రాయం లో మార్పు రావచ్చని అధికారులు ఆశిస్తున్నారు. తద్వారా మిగతా ప్రాంతాల వారు ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి అంగీకరించవచ్చని భావిస్తున్నారు. తొలిదశలో ఎంపిక చేసిన బస్తీలు... కుటుంబాలు... సామాజికవర్గాల వివరాలు సర్కిల్ బస్తీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు జనరల్ మొత్తం కాప్రా సింగం చెరువు 1 58 0 0 1 60 చార్మినార్-4 జంగమ్మెట్ 110 8 0 0 199 317 చార్మినార్-5 గోడేకి ఖబర్ 162 1 0 0 10 173 చార్మినార్-5 స్వామి వివేకానంద నగర్ 235 279 0 0 24 538 చార్మినార్-5 పార్థివాడ 7 150 0 0 0 157 అబిడ్స్-9 లంబాడీతండా 1 85 0 0 4 90 ఖైరతాబాద్-10 అంబేద్కర్ నగర్ 62 6 27 2 1 98 కూకట్పల్లి-14 అమ్రునగర్ తండా 0 155 0 0 0 155 మొత్తం 578 742 27 2 239 1588 -
స్లమ్ ఫ్రీ సిటీగా కరీంనగర్
మురికివాడలు లేని నగరంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. 23న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో నగర రూపురేఖలు మార్చేలా రూ.100 కోట్ల నిధులు రాబట్టుకునేందుకు అధికారులు, కార్పొరేషన్ పాలకవర్గం అంచనాలు రూపొందించారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, జేసీ పౌసుమి బసు, ఎంపీ వినోద్‌కుమార్, మేయర్ రవీందర్‌సింగ్‌లు సోమవారం నగరంలోని మురికివాడల్లో పర్యటించి, ప్రజలతో ముచ్చటించారు. - రాంనగర్/కరీంనగర్ రాంనగర్ : ముంబాయి, హైదరాబాద్‌లాంటి మహానగరాల్లోనే అపార్ట్మెంట్ కల్చర్ సహజంగా మారిందని, దానిని అనుసరించి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పేదింటి వారి కలలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కరీంనగర్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా మార్చడానికి అన్ని రకాల ప్రణాళికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి పర్యటించనున్న 10వ డివిజన్లోని పలు మురికివాడల కానీలను ఎంపీ సోమవారం పరిశీలించారు. ఇరుకు గుడిసెలలో ఉన్న వారికి రెండు బెడ్రూమ్స్, హాల్, కిచెన్ వంటి సదుపాయాలతో ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేస్తుందన్న హామీకి కట్టుబడి సీఎం పర్యటనకు రంగం సిద్ధమైందన్నారు. దాదాపు రూ.100 కోట్లతో స్లమ్ ఏరియాలలో ఇంటి నిర్మాణాలు, డ్రెరుునేజీలు, పార్క్‌లు, అర్బన్ హెల్త్ సెంటర్ వ ంటి అనేక సౌకర్యాలను అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు చే స్తున్నట్లు చెప్పారు. సీఎం చేస్తున్న స్లమ్ ఫ్రీ సిటీస్‌కు కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవడానికి కృషి చేస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక అనేక మంది కార్మికులు కరీంనగర్‌కు 30 ఏళ్ల క్రితం వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. అలాంటి వారికి భద్రత కల్పించాలనే కోణంలో సీఎం స్లమ్ ఏరియాలో పక్కా (జీ+1 )ఇంటి నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఇంటి స్థలాలు కేవలం 30 గజాలు నుంచి 50 గజాల వరకే ఉన్నాయని, వాటిలో రెండు బెడ్రూమ్స్, హాల్, కిచెన్ నిర్మాణాలకు స్థలం సరిపోదని, అందుకే అన్ని ఇళ్ల స్థలాలు మిళితం చేసి ఇంటిని నిర్మాణాలు చేపడతామని అన్నారు. సొంత భ వనంలో ఉండాలన్న కోణంలో ప్రజలు మాట్లాడిన వారి గాడిలో పెట్టేందుకు ఎంపీ స్థానిక, ఇతర రాష్ట్రాల్లో ఉన్న అపార్ట్మెంట్ కల్చర్‌ను వివరించారు. ప్రభుత్వ తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రజలకు వివరిస్తే వారికి అర్థమైందని, అసలు మా లీడ ర్లకే అర్థం కావడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులపై ఛలోక్తులు విసిరారు. మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ కేవీ.రమణాచారి, రెవెన్యూ ఆఫీసర్ మక్సూద్ మీర్జా, కార్పొరేటర్లు, నాయకులు శ్రీదేవిశ్రీనివాస్, సునీల్‌రావు, ఎడ్ల అశోక్, రవీందర్, ఓరుగంటి ఆనంద్ పాల్గొన్నారు. మురికివాడల అభివృద్ధికి కృషి కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ కరీంనగర్ : మురికివాడల్లో అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ అన్నారు. నగరంలోని రాజీవ్‌నగర్, గోదాంగడ్డలోని మురికివాడలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మురికివాడల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోం దని తెలిపారు. గతంలో మురికివాడల్లో పేదలకు ఇచ్చిన స్థలాల్లో గృహాలు నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. మేయర్ రవీందర్‌సింగ్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, కార్పొరేషన్ కమిషనర్ రమణాచారి, ఆర్డీవో చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, తహశీల్దార్ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
వి‘నూతనం’గా..
తెలంగాణ చరిత్రలో 2014ది ప్రత్యేక స్థానమైతే... 2015 సంవత్సరం గ్రేటర్ సిటీకి మరచిపోలేని జ్ఞాపకంగా మిగల్చాలనేది ప్రభుత్వ యోచన. ఆ దిశగా ఒక్కో అడుగూ ముందుకేసి... హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది సంకల్పం. ప్రస్తుతం ఉన్న పథకాలు... కార్యక్రమాలకు... మరికొన్నిటిని చేర్చి...నవశకం నిర్మించాలనేది లక్ష్యం. ఆ అడుగులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ⇒ ప్రణాళికతో కొత్త ఏడాదిలోకి.. ⇒విశ్వనగరం దిశగా అడుగులు ⇒ప్రాధాన్య క్రమంలో పనులు ⇒అధికార యంత్రాంగం సిద్ధం సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 2014వ సంవత్సరానిది ప్రత్యేక స్థానం. అందుకు అనుగుణంగానే కొత్త ప్రభుత్వం గ్రేటర్ నగరంలో విభిన్న పథకాలు... వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చు ట్టాలని భావించింది. అధికార యంత్రాంగమూ ఆ దిశగా సిద్ధమైంది. వాటిలో కొన్నిటికి శ్రీకారం చుట్టగా... మరికొన్ని కార్యరూపం దాల్చాల్సి ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని సీఎం చెబుతున్నారు.ఇవన్నీ కొత్త సంవత్సరం (2015)లో సాకారమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి... ఆధునిక రహదారులు ప్రభుత్వ తొలి ప్రాధాన్యం రహదారులు. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించనున్నారు. వాహనాలు గమ్యస్థానం చేరే వరకూ ఎక్కడా ఆటంకాలూ లేకుండా చూడాలనేది లక్ష్యం. ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్ ఆటంకాలు లేకుండా వీలైనన్ని మార్గాల్లో రహదారులను అభివృద్ధి పరచాలనేది లక్ష్యం. రోడ్లకు ఇరువైపులా వరదనీరు వెళ్లే మార్గాలు...పచ్చదనం... దారి పొడవునా ఎల్ఈడీ వెలుగులు. ఫ్లై ఓవర్లు, ఆర్ఓబీలు, గ్రేడ్ సెపరేటర్లు... స్పైరల్ మార్గాలు, స్కై వేల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం వెయ్యి కిలోమీటర్లలో నిర్మించాలనేది లక్ష్యం. తొలిదశలో 280 కి.మీ.లు పూర్తి చేయాలని నిర్ణయించారు. నాలాల ఆధునికీకరణ ఎంతో కాలంగా ఊరిస్తున్న నాలాల పనులు ముందుకు సాగేందుకు శ్రద్ధ చూపుతామంటున్నారు. నాలాల ప్రదేశాల్లోని ఆక్రమణల తొలగింపు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వాననీరు సాఫీగా వెళ్లేలా చేసేందుకు నిర్ణయం. వంద కిలోమీటర్ల మేర వీటిని ఆధునీకరించాలనేది లక్ష్యం. స్లమ్ ఫ్రీ సిటీ ముఖ్యమంత్రి కలలకు అనుగుణంగా వీలైనన్ని బస్తీల్లో రెండు పడక గదులు, హాల్, కిచెన్లతో కూడిన ఇళ్ల నిర్మాణం. స్లమ్స్‌లో రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి సదుపాయాల కల్పన. స్లమ్స్‌లోని స్థితిగతులను అంచనా వేసేందుకు కన్సల్టెంట్ సంస్థ బృందాలు ఇప్పటికే సర్వే జరుపుతున్నాయి. ఐడీహెచ్ కాలనీని స్లమ్ఫ్రీగా చేయడంతోపాటు దానిని మోడల్‌గా చూపుతూ మిగతా వాటినీ అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. చెరువుల పరిరక్షణ చెరువులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల పరిరక్షణ. పచ్చదనం పెంపు కార్యక్రమాలు. చెరువుల్లోని అక్రమ నిర్మాణాల తొలగింపుతో పాటు సుందర, పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలనేది ప్రాధాన్యాంశాల్లో మరొకటి. హరితహారంలో భాగంగా కోటి మొక్కలు నాటడం లక్ష్యం. పేదలకు జీవనోపాధి పేదలకు జీవనోపాధి, సంక్షేమ కార్యక్రమాలపై శ్రద్ధ. యువ త ఉపాధి కోసం డ్రైవర్‌కమ్ ఓనర్ పథకం కొనసాగింపు, ఉద్యోగాల కల్పనకు జాబ్‌మేళాలు, ఈ-వ్యాన్,ఈ-జోన్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ. వృద్ధుల ‘ఆసరా’పై ప్రత్యేక శ్రద్ధ. జీహెచ్ఎంసీ అందిస్తున్న ఆసరా కార్డుల ప్రయోజనాల సమీక్షతో పాటు వారికి ఉపయుక్తమైన కార్యక్రమాల అమలుకు కృషి. రూ. 5కే భోజనాన్ని 50 కేంద్రాలకు విస్తరణ 350 మంది నోడల్ అధికారులతో ‘స్పెషల్ డ్రైవ్’ రహదారులు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు 350 మంది నోడల్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ అంశాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి జనవరి 1 నుంచి 45 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు ఆస్తిపన్ను వసూళ్ల వంటి వాటిపై దృష్టి పెడతామని చెప్పారు. స్థానిక సంఘాలే కీలకం జీహెచ్ఎంసీలో పాలక మండలి... స్టాండింగ్ కమిటీ లేవు. ప్రజలు తమకు ఏ పనులు కావాలన్నా అధికారులను సంప్రదించాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను వీలైనంత వరకు స్థానిక సంఘాల ద్వారానే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. అందులో భాగంగా రూ.10 లక్షల లోపు పనులను స్థానిక బస్తీ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ అసోసియేషన్లకు అప్పగించనున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టికి తెచ్చి పరిష్కరించేలా ఈ సంఘాలు సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తాయి. జలమండలిలో... సాక్షి,సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలను పూర్తి చేసి... గ్రేటర్ దాహార్తిని తీర్చడమే ఈ ఏడాదిలో జలమండలి లక్ష్యమని అధికారులు తెలిపారు. కృష్ణా మూడోదశను 2015 మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి పథకాన్ని జూన్ 2015 నాటికి పూర్తి చేస్తామన్నారు. మూడో దశ ద్వారా నగరానికి నిత్యం 90 మిలియన్ గ్యాలన్లు, గోదావరి మొదటి దశ ద్వారా172 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తామని చెప్పారు. ఈ రెండు పథకాలతో గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని కాలనీల దాహార్తిని తీర్చడమే బోర్డు సిటీజనులకు ఇచ్చే నూతన సంవత్సర కానుకని పేర్కొన్నారు. మరోవైపు గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు నూతన సంవత్సరంలో శ్రీకారం చుట్టడం ద్వారా రానున్న నాలుగేళ్లలో మహానగర పరిధిలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇస్తామని హామీ ఇస్తున్నారు. -
హక్కు పత్రం.. మీ సొంతం
బస్తీ పేదలకు వరం స్థలాల క్రమబద్ధీకరణతో పాటు పక్కా ఇల్లు అటు పేదలకు సదుపాయం .. ఇటు స్లమ్ ఫ్రీ సిటీ మౌలిక సౌకర్యాలకూ ప్రాధాన్యం ఇదీ సర్కారు యోచన సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో 125 చ.గ.లోపు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న వారికిఉచితంగా క్రమబద్ధీకరణ చేయాలని భావిస్తోన్న ప్రభుత్వం.. మురికివాడల ప్రజలకు ఉచిత క్రమబద్ధీకరణతో పాటు రెండు పడక గదుల ఇళ్లు.. మౌలిక సదుపాయాలు కల్పించాలని యోచిస్తోంది. అందులో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్లైన్లు, వీధి దీపాలు, పార్కులు, విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాల వంటి సదుపాయాల కల్పనకు అవసరమైన స్థలాన్ని కేటాయించి... మిగిలిన ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని యోచిస్తోంది. ఇళ్ల నిర్మాణాలకు ముందుగానే 125 చ.గ.లోపు స్థలాల్లోని పేదలకు ‘హౌస్ రైట్ సర్టిఫికెట్’ (ఇంటి హక్కు పత్రం) ఇవ్వాలని భావిస్తోంది. ఈ సర్టిఫికెట్ ఉన్న వారికి రెండు పడకగదుల నివాస గృహం కేటాయిస్తారు. 20-30 చ.గ . వరకు ఉన్న వారి స్థలాన్ని విభజించకుండా అలాగే ఉంచాలని భావిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కమిటీలు వేసి, అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరణ.. టీఆర్ఎస్ హామీ మేరకు రెండు పడకగదుల ఇళ్లు.. మౌలిక సదుపాయాల కల్పనతో స్లమ్‌ఫ్రీ సిటీ.. ఒకేసారి కార్యరూపం దాల్చగలవని అంచనా వేస్తోంది. మురికివాడల్లోని వారు ఉంటున్న స్థలం మేరకు పట్టాలిస్తే.. మౌలిక సదుపాయాలకు చోటు దొరకదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలకు స్థలాన్ని కేటాయించాక... మిగిలిన ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆ దిశగా ఇప్పటికే సర్వే నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సర్వేలో వెల్లడైన వివరాలు ఇవీ... మొత్తం మురికివాడలు 1468 ప్రభుత్వ భూముల లోనివి 757 ప్రైవేట్ భూముల లోనివి 711 స్లమ్స్‌లో జనాభా 17.61 లక్షలు స్లమ్స్‌ను దిగువ అంశాల వారీగా వర్గీకరించారు.. జనసాంద్రత ఎక్కువగా ఉన్నవి ఇరుకు వీధులు {పమాదకర భవనాలు ఎక్కువ సంఖ్యలో భవనాలు {yైనేజీ, తాగునీటి పైప్లైన్లు వేసేందుకు వీలు లేనివి 72 స్లమ్స్‌లో నమూనా సర్వేలో వెలుగు చూసిన అంశాలివీ... 48 బస్తీలు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయి. వీటిల్లో 39 ప్రాంతాల్లో ప్రజలు 60 చ.గ.లోపునే ఉన్నారు. 20 చ.గ.లోపు ఇళ్లలో ఉంటున్న వారూ వీరిలో ఉన్నారు. తొమ్మిది కేసుల్లో మాత్రం దాదాపు 100 చ.గ. స్థలంలో ఉంటున్నారు. అనేక చోట్ల మౌలిక సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రజలకు వారి పేరిట ధ్రువపత్రాలు ఇచ్చినపుడే బస్తీలనుఅభివృద్ధి చేయాలని, మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.చెరువు కట్టలు, నాలాల ఒడ్డున ఉండే వారికి వేరే చోట స్థలం/ ఇల్లు కేటాయించాలనేది యోచన. స్లమ్స్‌కు కూడా తగిన లేఔట్లు రూపొందించి అభివృద్ధి చేయనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారి లేఔట్లలోని నిబంధనలను అమలు చేస్తూ, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిదీపాల వంటి వాటికి స్థలం కేటాయిస్తారు. స్లమ్స్‌లోని ప్రధాన మార్గంలో రహదారి కనీసం 30 అడుగులు, అంతర్గత రహదారులు కనీసం 20 అడుగుల వెడల్పునకు తగ్గకుండా చర్యలు తీసుకుంటారు.200 చ.గ. ఖాళీ స్థలాలు ఉన్న ప్రదేశాల్లో 50 నివాసాలకు మించకుండా, 400 చ.గ. ప్రదేశాల్లో 50కిపైగా నివాసాలు ఉండాలని ప్రాథమిక అంచనా. నివాస గృహం కనీస వెడల్పు 12 అడుగులు. సర్వే మేరకు.. బస్తీల్లోని ప్లాట్ల విస్తీర్ణం సగటున ఇలా... ప్లాట్ల విస్తీర్ణం (చదరపు గజాల్లో) .. మొత్తం మురికివాడలు 757 25 చ.గ.లోపు 65 (8.59 శాతం) 26-50 చ.గ.లోపు 267 (35.27శాతం) 51-75 చ.గ.లోపు 2634 (34.74శాతం) 76-125 చ.గ.లోపు 158 (20.87శాతం) 125 చ.గ.లపైన 4 (0.53 శాతం) రోడ్ల వెడల్పు... రోడ్ల వెడల్పు స్లమ్స్ శాతం 20 అడుగుల కంటే ఎక్కువ 363 47.95 10-19 అడుగులు 300 39.63 10 అడుగుల లోపు 94 12.42 స్లమ్స్‌లోని ఇళ్లలో నూరు శాతం పక్కా ఇళ్లు 162 ఉండగా, సెమీ పక్కా, కచ్చా ఇళ్లు 595 ఉన్నాయి. ఇళ్ల కేటాయింపు ప్రతిపాదనలివీ... మురికివాడల్లో రహదారులు ఇతరత్రా సదుపాయలతో పాటు విస్తీర్ణాన్ని నాలుగు ప్రతిపాదనులు సిద్ధం చేసినట్టు సమాచారం. మోడల్ 1 : ప్లాట్ విస్తీర్ణం 60 చ.గ . లోపు వారికి దీన్ని వర్తింపజేస్తారు. వీరికి హౌస్ రైట్ సర్టిఫికెట్లు స్లమ్స్ ప్రభుత్వ భూముల్లో ఉండి, 75 శాతం కచ్చా ఇళ్లు, పాక్షిక పక్కా ఇళ్లు, రోడ్లు 8-10 అడుగుల లోపు ఉన్న ప్రాంతాలకు వర్తింపజేస్తారు. మొత్తం స్లమ్స్‌లో ఇలాంటివి 60 శాతం ఉంటాయని అంచనా. మోడల్ 2 :రహదారులు, నివాసాలు మోడల్ 1 లాగే ఉన్నప్పటికీ, మార్కెట్ డిమాండ్ ఉండే ప్రైమ్ ఏరియా ప్రాంతాల్లో దీన్ని వర్తింపచేయాలనేది ఆలోచన. ఖాళీ ప్రదేశాల్లో కొంత భాగాన్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఇలాంటివి 15 శాతం ఉండవచ్చునని అంచనా. మోడల్ 3: నివాసాలు 60 చ.గ.ల కన్నా ఎక్కువ ఉండి, 70 శాతానికి పైగా పక్కా ఇళ్లున్న ప్రదేశాల్లోని వారికి పట్టాలిస్తారు. ఇలాంటివి 15 శాతం ఉండవచ్చని అంచానా. మోడల్ 4: ప్రమాదకర ప్రాంతాల్లోని(చెరువులు, నాలాల ఒడ్డున ఉండే) వారికి వేరే చోట ఇవ్వడం. ఇలాంటి స్లమ్స్ దాదాపు 10 శాతం ఉండవచ్చునని అంచనా. -
పరకాల పేదల కల నెరవే‘రే’
రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద మూడు కాలనీల ఎంపిక రూ. 5లక్షలతో అందమైన సొంతిల్లు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు పరకాల :పరకాల పట్టణంలోని మురికివాడలకు మహర్దశ పట్టనుంది. స్లమ్ ఫ్రీ సిటీ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆవాస్ యోజన(ఆర్‌ఏవై) పథకానికి పరకాల నగర పంచాయతీలోని మూడు మురికివాడలు ఎంపికయ్యూరుు. ఏడాది క్రితం నిర్వహించిన సర్వేలో తొమ్మిది కాలనీలను మురికివాడలు(నోటిఫైడ్ స్లమ్స్) గుర్తించినప్పటికీ అందులో మొదటి దశలో మూడు కాలనీల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మురికివాడలు లేని పట్టణాలు, నగరాలను నిర్మించే లక్ష్యంతో గత యూపీఏ ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఎలాంటి వసతులు లేని మురికివాడల్లో ప్రజలు ఉండడానికి ఇళ్లు, రోడ్లు, మం చి నీటితోపాటు మౌళిక వసతులన్ని కల్పించడమే ఈ పథకం ముఖ్యోద్ధేశము. ఇందులో భాగం గా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ము నిసిపల్ ఏరియాస్(మెప్మా) పరిధిలో పని చేసే పట్టణ మహిళ సమాఖ్యతో ఈ ఏడాది జనవరి లో ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా పట్టణంలోని హరిజనవాడ(కొత్తకాలనీ), బీసీ కాలనీ, రాజీపేట ఎస్సీ కాలనీ, వడ్లవాడ, కుమ్మరివాడ, వెలుమ, గౌడవాడ, మా దారం హరిజనవాడ, గండ్రవాడ, మోరేవాడ ను మురికివాడల కింద గుర్తించారు. అంతేగాక అప్పటి మెప్మా ఏఎండీ కే. విద్యాధర్ జనవరి 23న నగర పంచాయతీని సందర్శించి స్థాని కుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడు కాలనీలు ఎంపిక సర్వే, అధికారుల పర్యటన అనంతరం పట్టణంలోని మూడు కాలనీలు ఈ పథకం అమలుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బీసీ కాలనీ, సీఎస్ఐ, హరిజనవాడల్లో రే పథకం కింద గృహాలను నిర్మించడానికి ఎంపిక చేశారు. బీసీ కాలనీలో 338, సీఎస్ఐ, హరిజనవాడల్లో 380 గృహాలు నిర్మించనున్నారు. ఒక్క గృహానికి రెండు బెడ్రూంలు, హాల్, కిచెన్ గదులు ఉండేలా నిర్మాణం చేస్తారు. ఎంపికైన ఆ మూడు కాలనీల్లో ఒకే తీరులో ఉండే గృహాలు, రోడ్లు, తాగునీటి వసతి, ఇతర మౌలిక వసతులను కల్పిస్తారు. మరో రెండు మూడు నెలల్లో నిర్మాణాలను చేపట్టవచ్చని అధికారులు తెలుపుతున్నారు. రే పథకం ప్రారంభిస్తే పట్టణ రూపురేఖల్లో మార్పులు కన్పిస్తాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ పథకం కింద ఎంపికైన ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.5 లక్షలు కాగా.. ఇందులో కేంద్రం వాటా రూ.3.75 లక్షలు(75%), రాష్ట్రం వాటా రూ.75 వేలు((15%), లబ్ధిదారుడి వాటా రూ.50 వేలు(10%) ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది రే పథకం కింద మా కాలనీ ఎంపిక కావడం ఆనందంగా ఉంది. 30 ఏళ్ల నుంచి బీసీ కాలనీ అభివృద్ధికి దూరంగా ఉంది. ప్రభుత్వం రెండు వందల గజాల చొప్పున ఉచితంగా స్థలం, గృహాలు నిర్మించి ఇచ్చింది. గతంలో నిర్మించిన ఇల్లు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడు రే పథకం కింద మోడల్ కాలనీ కోసం ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉంది. - అల్లె దశరథం, కౌన్సిలర్, బీసీ కాలనీ -
ముందడుగు
* ‘స్లమ్ ఫ్రీ సిటీ’కి స్టేట్ స్క్రీనింగ్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ * రూ.2,374 కోట్లతో 183 మురికివాడల అభివృద్ధి * ‘స్మార్ట్ సిటీ’కి డీపీఆర్‌కు సన్నాహాలు * ‘ఫండ్ యువర్ సిటీ’తో 15 జంక్షన్ల ముస్తాబు * సమావేశంలో నగర కమిషనర్ సువర్ణ పండాదాస్ వరంగల్ అర్బన్ : ఓరుగల్లు రూపురేఖలు మార్చే బృహత్తర ప్రణాళికకు నగర పాలక సంస్థ ముందడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో వరంగల్ నగరానికి స్మార్ట్ సిటీ హోదా దక్కుతుందనే విశ్వాసంతో బల్దియా అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రతిపాదలకు రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్లు ప్రకటించారు. ఫండ్ యువర్ సిటీ కింద 15 జంక్షన్లకు నిధులు సేకరించి మోడల్‌గా ముస్తాబు చేస్తామని తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన సేవలు, మౌలిక వసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ సువర్ణ పండాదాస్ బుధవారం సాయంత్రం బల్దియా కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రతిపాదనలకు ఆమోదం వరంగల్ స్లమ్ ఫ్రీ సిటీ యాక్షన్ ప్లాన్‌కు స్టేట్ లెవల్ స్క్రీనింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ నగరాలు స్లమ్ ఫ్రీ సిటీ యాక్షన్ ప్లాన్ ప్రతిపాదించాయి. మొదట వరంగల్ మురికివాడలపై బల్దియా రూపొందించిన డీపీఆర్‌పై స్క్రీనింగ్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ట్రైసిటీస్‌లో ఉన్న 183 మురికివాడల్లోని పేదలకు మౌలిక వసతులు, డబుల్‌బెడ్ రూమ్‌లతో కూడిన ఇళ్లకు ప్రతిపాదనలు రూపకల్పన చేయడం జరిగింది. గతంలో సింగల్ బెడ్ రూమ్‌కు 274 స్కేర్ ఫీట్లతో తయారు చేయగా, తాజాగా 458 స్కేర్ ఫీట్లతో తయారు చేయడం జరిగింది. యూనిట్ కాస్ట్ గతంలో రూ.5.72 లక్షలు కాగా ఇప్పడు రూ.8.15 కోట్లుగా అంచనాతో తయూరు చేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.2,374 కోట్లతో తయారు చేసి డీపీఆర్‌లను సమర్పించడమైనది. 2013-2022లో తొమ్మిదేళ్లలో మురికివాడల్లో మెరుగైన వసతులు సమకూరుస్తాం. తొలి దశగా మురికివాడల్లోని అంబేద్కర్ నగ ర్, గాంధీనగర్, మీరాసాహెబ్ కుంటలను పైలేట్ ప్రాజెక్టు ఎంచుకొని అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.70.76 కోట్ల నిధులు మంజూరు చేసింది. 31 మురికివాడలు అ త్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఉన్నాయని, ఇక్కడి ప్రజల కోసం ప్రభుత్వ స్థలం 62 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నాం. ఈ స్థలంలో 31 మురికివాడల్లోని 6,336 మంది కు టుంబాలకు బహుళ అంతస్తుల్లో డబుల్ బెడ్ రూమ్‌లతో ఇళ్లను కట్టించి, వసతులు సమకూర్చాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథ కం శంకుస్థాపన చేసేందుకు సన్నహాలు చేస్తున్నాం. స్మార్ట్‌సిటీకి ప్రతిపాదనలు దేశ వ్యాప్తంగా 100 నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో వరంగల్ నగరం ఒకటి. స్మార్ట్ సిటీ కోసం ప్రతిపాదనలను తయారు చేస్తున్నాం. పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్టు, సిస్టమ్, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, పార్కింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, స్మార్ట్ పవర్ గ్రిడ్ సిస్టమ్, వైఫై సర్వీసు కనెక్టివిటి, ప్రతి ఇంటి నంబరును జీఐఎస్ నమోదు, ఈ-గవర్నెన్సి ఇ-సేవా సెంటర్లు, తాగునీటి సరఫరాలో స్కాడా సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ, సివరేజీ సిస్టమ్స్, ఎస్ఎఫ్సీపీవోఏ సిస్టమ్, ఇంటెలిజెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌పై ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. అందుకోసం నిట్ ప్రొఫెసర్లు, ఇంజినీరింగ్ విద్యార్థుల సేవలను తీసుకోనున్నాం. స్మార్ట్సిటీపై త్వరలో స్టేక్ హోల్డర్ల సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఫండ్ యువర్ సిటీతో 15 జంక్షన్ల ముస్తాబు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, వాణిజ్య వర్గాలు, సంస్థల ద్వారా ఫండ్ యువర్ సిటీ నిధులను సేకరించేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రైసిటీస్‌లో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 15 జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. మడికొండ, కాజీపేట, వడ్డేపల్లి క్రాస్ రోడ్డు, కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ ఆర్టీసీ, రాంనగర్, కిట్స్, వడ్డేపల్లి చర్చి, గోపాలపురం, మిషన్ ఆస్పత్రి, వరంగల్ రైల్వే-ఆర్టీసీ బస్‌స్టేషన్, పెద్దమ్మ గడ్డ, హంటర్ రోడ్డు ఆర్వోబీ, అబ్బనికుంట, గోకుల్ నగర్ జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకోసం వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, క్లబ్‌లు, చాంబర్ ఆఫ్ కామర్స్, రైస్‌మిల్లర్స్, కిరాణ మర్చంట్స్, ఫంక్షన్ హాల్స్, కూరగాయల, పండ్ల మార్కెట్, లారీ అసోసియేషన్స్ తదితర వర్గాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ కమిషనర్ నలుపరాజు శంకర్, ఇన్చార్జీ డిప్యూటీ కమిషనర్ గంగుల రాజిరెడ్డి, ఎస్ఈ అబ్దుల్ రహ్మాన్, సీపీ రమేష్‌బాబు పాల్గొన్నారు. -
సేఫ్ స్మార్ట్..
‘గ్రేటర్ నగరాన్ని సురక్షిత (సేఫ్) టెక్నాలజీ వినియోగంతో సుపరిపాలన(స్మార్ట్).. మురికివాడల రహిత(స్లమ్‌లెస్) సిటీగా మార్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది’. - ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలను తమ పార్టీ వైపు... పెట్టుబడిదారులను రాజధాని వైపు ఆకర్షించే మంత్రం... శాంతిభద్రతలకు అగ్రాసనం... మౌలిక వసతులకు ప్రాధాన్యం... ఇదీ గులాబీ మార్కు బడ్జెట్ స్వరూపం. తెలంగాణ రాష్ట్ర తొట్టతొలి ప్రభుత్వం... మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధానికి నిధుల ‘భాగ్యం’ దక్కింది. నేరరహిత రాజధాని దిశగా అడుగులు పడుతుండడం సిటీజనం ఆకాంక్షలను ప్రతిఫలిస్తోంది. ► బడ్జెట్లో రాజధానికి ప్రాధాన్యం ► స్లమ్‌ఫ్రీ సిటీ ప్రాజెక్టుకు రూ.250 కోట్లు ► జంట కమిషనరేట్లకు రూ.186 కోట్లు ► ఆస్పత్రుల అభివృద్ధికి రూ. 564 కోట్లు ► జలమండలికి రూ.600 కోట్లు ► ఎంఎంటీఎస్- 2కు: రూ. 20.83 కోట్లు ► గ్రేటర్ ఆర్టీసికి రూ. 345 కోట్లతో 150 బస్సుల కొనుగోలు ► కలల మెట్రోకు రూ. 416 కోట్లు ► హెచ్ఎండీఏ కోరింది రూ. 2000 కోట్లు ఇచ్చింది 1000 కోట్లు విద్యకు మొండిచెయ్యి సాక్షి, సిటీబ్యూరో: సేఫ్.. స్మార్ట్ సిటీ దిశగా తొలి అడుగు పడింది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రాధాన్యాలేమిటో తేటతెల్లం చేసింది. గ్రేటర్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీని బలోపేతం చేసే దిశగా... బస్తీవాసులను తమ వైపు తిప్పుకునేందుకు వీలుగా గులాబీ సర్కారు ప్రణాళిక సిద్ధం చేసింది. తాజా బడ్జెట్లో స్లమ్‌ఫ్రీ సిటీకి రూ.250 కోట్లు కేటాయించడం అందులో భాగమేనని విశ్లేషకుల అంచనా. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిచ్చి... మహానగరాన్ని నేరరహిత రాజధానిగా తీర్చి దిద్దేందుకు... తద్వారా పెట్టుబడులకు స్వర్గధామంగా మలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తాజా బడ్జెట్ ముఖచిత్రం సుస్పష్టం చేస్తోంది. కాగితాలకే పరిమితమైన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రూ.90 కోట్లు కేటాయించడం ద్వారా స్మార్ట్‌సిటీ దిశగా ప్రస్థానం మొదలైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా బడ్జెట్ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు, వివిధ విభాగాల వారీగా బడ్జెట్ ముఖచిత్రమిదీ... వీటికే అగ్ర తాంబూలం సేఫ్‌సిటీ: హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్లకు సుమారు రూ.186 కోట్లు కేటాయించడం ద్వారా నగరాన్ని నేరరహిత రాజధానిగా మార్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. నేరాల రేటు గణనీయంగా తగ్గితే నగరానికి పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయన్నది సర్కారు భావన. స్మార్ట్‌సిటీ: మొన్నటి వరకు కాగితాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టుకు రూ.90 కోట్లు కేటాయించింది. తద్వారా ఐటీ ఆధారిత పరిశ్రమల వృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. స్లమ్‌ఫ్రీ సిటీ: నగరంలోని మురికివాడల్లో కనీస మౌలిక వసతుల కల్పన, రహదారులు, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించినదే స్లమ్‌ఫ్రీ సిటీ పథకం ఉద్దేశం. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 1500కు పైగా మురికివాడలున్న విషయం విదితమే. వీటిల్లో దశల వారీగా మౌలిక వసతులు కల్పించాలన్నది సర్కారు లక్ష్యమని బడ్జెట్ చాటిచెప్పింది. -
‘స్మార్ట్’ బడ్జెట్
నిధుల సేకరణకు అధికారుల వ్యూహం రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక పద్దులు ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ నివేదిక సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ సర్కారు కలల ప్రాజెక్టులైన వరల్డ్ క్లాస్ సిటీ, స్లమ్ ఫ్రీ సిటీ, స్మార్ట్‌సిటీల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలంటే భారీ స్థాయిలో నిధులు అవసరం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వీటికి ప్రత్యేక హెడ్స్ (పద్దులు) ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో వివిధ ప్రభుత్వ శాఖలు భాగస్వాములు కానున్నాయి. ఆ శాఖలకు కేటాయించే నిధులు వాటి అవసరాలకే పరిమితమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు ప్రత్యేక పద్దులుంటే మంచిదనే తలంపులో అధికారులు ఉన్నారు. వీటిని సత్వరం పూర్తి చేసేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలైన ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు ఐదు నుంచి పదేళ్ల వరకు పట్టనుంది. దశల వారీగా పనులు పూర్తి చేయాలన్నా రూ.వందల కోట్లు అవసరం. దీంతో ప్రత్యేక పద్దుల కింద నిధులు మంజూరు చేయాల్సిన అవసరముందని అధికారులు భావిస్తున్నారు. ఆమేరకు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. తద్వారా ఏటా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చార్మినార్ పాదచారుల పథకానికి అవసరమైన దాదాపు రూ.500 కోట్లకు బడ్జెట్లో ప్రత్యేక పద్దు ఉన్న సంగతి తెలిసిందే. దానికంటే భారీ వ్యయంతో కూడుకున్నందున ఈ ప్రాజెక్టులకుప్రత్యేక పద్దుల అవసరాన్ని వివరిస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. వేలాది కోట్లు కావాలి.. స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగాతొలిదశలో నియోజకవర్గానికో స్లమ్‌ను ఎంపిక చేసినా దాదాపు రూ. 650 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఈ లెక్కన గ్రేటర్‌లోని 1476 మురికివాడలను అభివృద్ధిపరచి స్లమ్ ప్రీ సిటీగా మార్చాలంటే రూ.వేల కోట్లు అవసరం. ఈ తరహాలోనే వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులు.. భూగర్భ డక్టింగ్లు, ఫుట్‌ఫాత్‌లు, సైక్లింగ్ మార్గాలు, ఎల్ఈడీ లైట్లు కావాల్సి ఉంటుంది. వీటిని అందుబాటులోకి తేవాలంటే రూ. వేలాది కోట్లు అవసరం. స్మార్ట్సిటీకీ అంతే స్థాయిలో నిధులు కావాల్సి ఉంటుంది. ప్రత్యేక పద్దులతో ఈ నిధులు మంజూరుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రహదారులకు రూ.10 వేల కోట్లు నగరాన్ని ‘గ్లోబల్’గా తీర్చిదిద్దాలంటే తొలుత రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. లండన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలకు తీసిపోనివిధంగా రహదారుల నిర్మించాలి. కేబుల్ వైర్లు భూగర్భంలో వేసేందుకు డక్టింగ్ ఏర్పాటు,్ల రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించడం, వరదనీటి కాలువలు, విద్యుత్ దీపాలు తదితర సదుపాయాలతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, సామూహిక మరుగుదొడ్లు, బస్షెల్టర్లు అవసరం. దీనికోసం అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలు వినియోగించుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ తరహారహదారులకు రూ.10వేల కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా. కాలువలకూ అధిక మొత్తం కావాల్సిందే నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చాలంటే తొలుత వరదనీరు సాఫీగా పోయేలా పనులు చేపట్టాలి. అందుకు దాదాపు రూ.16 వేల కోట్లు అవసరమని గతంలో అం చనా వేశారు. ఇది ఇంకా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. రాబడిపై జీహెచ్ఎంసీ దృష్టి ఇప్పటి వరకు రూ.5కే భోజనం.. బస్తీలకు శుద్ధజలం వంటి పథకాలపై శ్రద్ధ చూపిస్తున్న జీహెచ్ఎంసీ... ఆదాయ మార్గాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించడంతో రూ.వెయ్యి కోట్లకు పైగా వసూలైంది. అదే తరహాలో వివిధ మార్గాల ద్వారా రావాల్సిన ఆదాయంపైనా దృష్టి పెడుతున్నట్టుసోమేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీకి వృత్తిపన్ను దాదాపు రూ. 300 కోట్లు రావాల్సి ఉండగా, రూ.100 కోట్లు కూడా రావడం లేదు. మోటారు వాహనాల పన్నుల వాటా, వినోదపు పన్ను, ఇతరత్రా మార్గాల్లో రావాల్సిన వందల కోట్ల నిధులు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరడం లేదు. వీటన్నింటిపై శ్రద్ధ వహించడం ద్వారా ఎవరిపై ఎలాంటి భారమూ మోపకుండానే జీహెచ్ఎంసీ ఆదాయం కనీసం 30 శాతం పెరగగలదని అంచనా. ఆ దిశగా అవసరమైన కసరత్తు ప్రారంభించారు. వరల్డ్ క్లాస్ సిటీ కి కావాల్సినవి... చక్కని రహదారులు, ఫుట్‌పాత్‌లు పార్కింగ్ ప్రదేశాలు వీధి దీపాలు 24 గంటలపాటు నీటి సరఫరా నిరంతరం విద్యుత్ సరఫరా భూగర్భడ్రైనేజీ చెరువుల పరిరక్షణ శుద్ధమైన తాగునీరు మెరుగైన ప్రజారవాణా భూగర్భకేబుళ్లు స్మార్ట్‌సిటీకి... వైఫై సేవలు ఆధునిక సాంకేతిక వనరులు ఇంట్లో కూర్చునే నెట్వర్క్తోవివిధ పనులు చేసుకోగలగడం ఫోన్ మెసేజ్‌తో సమస్యల పరిష్కారం -
దాస్య శృంఖలాలు తెగినా సమస్యలు తీరలేదు..
ఈ వెతల ‘చెర’ఇంకెన్నాళ్లు స్వాతంత్య్ర దినోత్సవం అంటే ‘పతాక’ స్థాయి సంబరం. ఇది ఏటా వచ్చేదే అయినా ఈసారి ప్రత్యేకత ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొట్టతొలి జెండా పండుగ ఇది. తెలంగాణ సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటేలా ఈ వేడుక నిర్వహించేందుకు ప్రభుత్వం చారిత్రక గోల్కొండ కోటను వేదికగా ఎంచుకుంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న సంతోషంలో అంబరాన్నంటేలా పంద్రాగస్టు సంబరాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ తరుణంలో నగరవాసి గుండెల నిండా జెండా పండుగ సంబరాలు ప్రతిఫలిస్తున్నా.. ఏదో వెలితి. నాడు దాస్య శృంఖలాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఫలితంగా స్వాతంత్య్రం లభించినా.. నేటికీ మన చుట్టూనే తిష్టవేసి ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న సమస్యల నుంచి మాత్రం విముక్తి లభించట్లేదు. ఇంకెన్నేళ్లు ఈ సమస్యలపై పోరాడాలని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని, విశ్వనగరంగా కీర్తిపతాక ఎగురవేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నిజమై, హామీలు అమలై ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతుల్లో మార్పు రావాలని ఆశిస్తున్నారు. కనీస సదుపాయాలు సమకూరి, అంతా నాణ్యమైన జీవనం గడిపిన నాడే నగరవాసి సమస్యల చెర నుంచి బయటపడినట్టని, కొత్త ప్రభుత్వ హయాంలోనైనా పాత సమస్యల నుంచి విముక్తి కలగాలని అంతా కలలు కంటున్నారు. ఆ కలలు సాకారం కావాలంటే, ఆశలు నెరవేరాలంటే మొదట ఈ సమస్యలు తీర్చాలని నగరవాసులు ఏకరువు పెడుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో నడక యాతన ఇంకెన్నాళ్లు? గ్రేటర్లో 7 వేల కిలోమీటర్ల మేర రోడ్లున్నా.. ప్రజలు నడిచేందుకు ఒక్క మార్గమూ సరిగా లేదు. పాదచారులు నడిచేందుకు ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లు కబ్జాల పాలయ్యాయి. ఇక కాస్తో కూస్తో ఉన్న వాటిపై నడిచే పరిస్థితి లేదు. ఫలితంగా ఏటా దాదాపు 200 మంది పాదచారులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వివిధ ప్రమాదాల్లో క్షతగాత్రులవుతున్న వారిలో 40 శాతం మంది పాదచారులే కావడం విషాదం. ‘పాదచారే మహారాజు’ అనేది నినాదానికే పరిమితమైంది. కేసీఆర్ సర్కారు మొదట పాదచారుల కష్టాలు తప్పించాల్సి ఉంది. నగరంలో రోడ్డు దాటడమంటే మాటలు కాదు. అవసరమైన చోట్ల ఎఫ్‌ఓబీలు ఏర్పాటు చేయాలి. రోడ్డు దాటేందుకు ప్రత్యేక మార్కింగ్‌లు ఉండాలి. వాటిని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంటి నంబరు ఓ పజిల్ ప్రస్తుతం సమగ్ర సర్వేకు సర్కారు సిద్ధమైంది. ఈ నిమిత్తం ఇంటింటికి వెళ్లే అధికారులకే మతిపోయేలా నగరంలో ఇంటి నంబర్లు ఉన్నాయి. అస్తవ్యస్తపు ఇళ్ల నంబర్లతో గజిబిజి గల్లీలతో నగరంలో చిరునామా కనుక్కోవడం అంత ఈజీ కాదు. సులభంగా, శాస్త్రీయ పద్ధతిలో ఇంటి నంబర్లుండాలనే ఆలోచన పాతదే అయినా, అమలుకు నోచలేదు. దశాబ్దాలుగా, ప్రభుత్వాలు మారుతున్నా కొలిక్కిరాని ఈ సమస్యను టీఆర్ఎస్ సర్కారైనా పరిష్కరిస్తుందేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అభివృద్ధి నీడలో మురికివాడల జాడ ఎన్నెన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన రాజధానిలో మురికివాడలూ తక్కువేం లేవు. సీఎం కేసీఆర్ ‘స్లమ్ ఫ్రీ సిటీ’ చేస్తామని హామీనిచ్చారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటే ముందు నగరంలో మురికివాడలు లేకుండా చేయాలని పేదలు కోరుతున్నారు. బ్రాండ్ ఇమేజ్ సాధనకు ముందు ప్రజలందరికీ కనీస సదుపాయమైన గూడు గోడు తీర్చాలి. గ్రేటర్లో ఇప్పటికే గుర్తించిన 1476 స్లమ్స్ రూపురేఖలు మార్చడంతోపాటు.. కొత్తగా ఏర్పడిన వాటినీ గుర్తించి మురికివాడరహిత నగరంగా తీర్చిదిద్దాలి. జేఎన్‌ఎన్‌యుూఆర్‌ఎం పథకం ద్వారా గ్రేటర్‌కు 78,746 ఇళ్లు వుంజూరు కాగా ఆరేళ్లుగా పదివేల మందికీ లబ్ధి చేకూరలేదు. ‘చెత్త’శుద్ధి ఏదీ? జీహెచ్ఎంసీ ఏటా రూ.225 కోట్లు పారిశుధ్య కార్మికులకు వేతనాలుగా చెల్లిస్తున్నా, దాదాపు 20 వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నా చెత్త సమస్య తీరట్లేదు. రోజూ దాదాపు 3800 మెట్రిక్ టన్నుల చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. రోడ్లు, కాలనీలు, బస్తీల్లో ఎక్కడ చూసినా చెత్తే.. ఈ పరిస్థితిని మెరుగుపర్చాల్సి ఉంది. ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్రాజెక్టులను అమలుచేయాలి. తద్వారా పారిశుధ్య ఇబ్బంది తీరడంతో పాటు విద్యుత్ అవసరాలూ కొద్దిమేర తీరతాయి. కొన్ని రోడ్లను మాత్రమే చెత్తరహితంగా కాకుండా అన్నిటినీ అదే మాదిరిగా తీర్చిదిద్దాలి. ముంపు ముప్పు తప్పేనా? పేరుగొప్ప నగరంలో వానొస్తే రోడ్లే చెరువులయ్యే దుస్థితి. ఇందుకు కారణం వరద నీటి కాలువలు కుంచించుకుపోవడమే. నాలాల విస్తరణ, అభివృద్ధికి వందల కోట్ల నిధులున్నా.. పనులు సాగట్లేదు. నగరాభివృద్ధికి తగిన మాస్టర్‌ప్లాన్‌కు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలు పొందేందుకు సిద్ధమైన ప్రభుత్వం వరదనీటి కాలువల విస్తరణపైనా శ్రద్ధచూపాలి. ఇందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తే తప్ప రాదార్లు గోదారులయ్యే సమస్య నుంచి నగరం బయటపడదు. వివిధ ప్రాంతాల్లో 71 కిలోమీటర్ల మేర నాలాల వెడల్పు/ఆధునీకరణకు జేఎన్ఎన్యూఆర్ఎం నుంచి రూ.266 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఆరేళ్లుగా పనులు అతీగతీ లేవు. ఇప్పటికి రూ.125 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. వచ్చే మార్చి వరకు మాత్రమే గడువుంది. ఈలోగా ఏంచేస్తారో.. ఏమో!. మన ‘దారి’.. యమదారి నగరంలో రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే. పట్టుమని పది మీటర్ల మేర రోడ్లు కూడా సవ్యంగా ఉండదు. అస్తవ్యస్తపు రహదారుల వల్ల ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ట్రాఫిక్ సమస్యా పెరుగుతోంది. గుంతల రోడ్లతో వాహనదారుల నడుములు విరుగుతున్నాయి. ఏడువేల కిలోమీటర్ల రహదారుల్లో వీఐపీల ప్రాంతాల్లోవి తప్పస్తే అన్నింటా అవస్థలే. అందమైన రోడ్లే నగరాభివృద్ధి ముఖచిత్రంగా నిలుస్తాయి. మరి మన రోడ్ల సమస్య ఎన్నటికి తీరేనో?!. నగరవాసి ఆరోగ్యానికి ‘పొగ’ ఆరోగ్యానికి పొగబెడుతున్న వాయు, శబ్ద కాలుష్యాల నుంచి విముక్తి కల్పించాలని సిటిజన్లు కోరుతున్నారు. గ్రేటర్లో నిత్యం రోడ్డెక్కుతోన్న సుమారు 35 లక్షల వాహనాలతో నగర జీవనం పొగచూరుతోంది. అబిడ్స్, పంజగుట్ట, చార్మినార్, జూపార్క్, కేబీఆర్ పార్క్ ప్రాంతాల్లో ధూళిరేణువుల స్థాయి అత్యధికంగా నమోదవుతోంది. ఈ పరిస్థితిని నివారించాలంటే 15 ఏళ్లకు పైబడిన వాహనాలు రోడ్డెక్కకుండా చేయాలి. ప్రతి వాహనానికి ఏటా కాలుష్య తనిఖీలు నిర్వహించాలి. ఇంధన కల్తీకి అడ్డుకట్ట వేయడంతో పాటు కాలుష్యకారక బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలను ఔటర్ రింగురోడ్డు ఆవలకు తరలించాలి. మంచినీళ్లే మహా ప్రసాదం గ్రేటర్లో నివాస సముదాయాలు 24 లక్షలు. నల్లా కనెక్షన్లు 8.25 లక్షలు మా త్రమే. అంటే మూడో వంతు జనానికే నీళ్లందుతున్నాయి. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల్లోని వెయ్యి కాల నీలకు మంచినీటి సరఫరా వ్యవస్థ లేదు. 35 లక్షల మంది కి నిత్యం ‘పానీ’పట్లు తప్పట్లేదు. ఆయా ప్రాంతాలకు సు మారు రూ.5 వేల కోట్లతో పైప్‌లైన్ వ్యవస్థ, నీటి స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంది. గోదావరి, కృష్ణా మూ డో దశలను పూర్తిచేస్తేనే అంతోఇంతో సమస్య తీరుతుంది. నగరం ‘మురుగు’తోంది గ్రేటర్ పరిధిలో డ్రైనేజీ వసతు లు లేని వెయ్యి కాలనీలు, బస్తీ ల్లో నిత్యం రోడ్లపై మురుగునీ రు పొంగిపొర్లుతోంది.ఈ సమస్యతో జనం అవస్థలు పడుతున్నారు. రూ.4 వేల కోట్ల అంచనాతో డ్రైనేజి వసతులు కల్పిస్తేనే ఈ సమస్య నుంచి జనానికి విముక్తి. డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుకు జలమండలి గతంలో సిద్ధంచేసిన మాస్టర్‌ప్లాన్‌కు తెలంగాణ నూతన సర్కారు నిధులు విడుదల చేస్తే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. పౌరసేవలు.. ఏ ప్రభుత్వ విభాగంలో సేవలు పొందాలన్నా కాళ్లరిగేలా తిరగాల్సిందే. జనన, మరణ ధ్రువీకరణపత్రాల నుంచి మొదలు పెడితే.. భవన నిర్మాణ అనుమతులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల దాకా ఇదే దుస్థితి. చేతులు తడపనిదే పనులు కావట్లేదు. దీన్ని నివారించి వివిధ విభాగాల్లో జవాబుదారీతనం పెర గాలి. అందరి సహకారంతో... అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లక్ష్యాలకనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీపై ఉంది. అందులో భాగంగా స్లమ్‌ఫ్రీ సిటీ, గుంతలు లేని రోడ్లు, మెరుగైన పారిశుధ్యం నిర్వహణకు ఇప్పటికే ఆయా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వీటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలి. అందుకు అందరి సహకా రం కావాలి. అధికారులు, సిబ్బందితో పాటు ప్రజల సహకారంతో వీటిని పూర్తిచేయగలమన్న నమ్మకం ఉంది. - సోమేశ్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ -
టార్గెట్ 2050
- ప్రపంచస్థాయి నగరానికి ప్రణాళికలు - తాగునీటి సరఫరాకి ప్రాధాన్యం - నిధుల గురించి ఫికరొద్దు ! - పది రోజుల్లో నివేదిక ఇవ్వండి - ‘గ్రేటర్’పై సమీక్షలో కేసీఆర్ సాక్షి, సిటీబ్యూరో: ఓవైపు స్లమ్ ఫ్రీ సిటీ (మురికివాడలు లేని నగరం).. మరోవైపు అంతర్జాతీయస్థాయి నగరం.. ఈ రెండింటినీ అమలు చేయాలనుకుంటున్న నూతన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో గ్రేటర్ పరిధిలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2050 నాటికి గ్రేటర్ జనాభాను దృష్టిలో ఉంచుకొని అందుకనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అందుకు ఎన్ని నిధులు అవసరమైనా ఫర్వాలేదన్నారు. మెరుగైన ప్రజాసదుపాయలకు.. ప్రపంచస్థాయి నగరంగా విరాజిల్లేందుకు చేయాల్సిన పనులపై తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా సూచించారు. పదిరోజుల్లో తగు నివేదికను సిద్ధం చేయాలన్నారు. కేసీఆర్ అభిమతం మేరకు గ్రేటర్ నగరంలో దిగువ పనులు కార్యరూపం దాల్చనున్నాయి.టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని హామీకి అనుగుణంగా రెండు బెడ్రూమ్లు, హాల్, కిచె న్, బాత్రూమ్లతో కూడిన ఇళ్లను పేదల కోసం నిర్మించనున్నారు. నగరంలో ప్రజలు ముందుకొచ్చే ప్రాం తాల్లో పైలట్‌ప్రాజెక్టుగా వీటిని వెంటనే చేపట్టనున్నారు. అందుకుగాను స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కార్పొరేటర్ల సలహాల స్వీకరణ సైతం ప్రారంభించారు. - నగరంలో తరచూ ఎదురవుతున్న రహదారుల సమస్యలు.. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చేసే చర్యలు వెంటనే చేపట్టనున్నారు. చెత్త, డెబ్రిస్ నిర్వహణ పనుల్ని కూడా త్వరితంగా చేపట్టనున్నారు. వర్షాకాలంలో తరచూ భవనాలు కూలిపోతుండటాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ దాదాపు నాలుగేళ్ల క్రితం నారాయణగూడలో భవనం కూల డాన్ని గుర్తు చేశారు. రహదారులు, నీటినిల్వ సమస్యల పరిష్కారానికి అవసరమైతే అంతర్జాతీయ కన్సల్టెంట్లను సంప్రదించాల్సిందిగా సూచించారు. అధికారులు ఆ దిశగా అడుగు వేయనున్నారు. - మౌలిక సదుపాయాల కల్పన.. ట్రా‘ఫికర్’ నుంచి విముక్తి.. 24 గంటల పాటు విద్యుత్, నీటిసరఫరాపై శ్రద్ధ చూపనున్నారు. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్లో 78 లక్షల జనాభా ఉండగా.. ప్రస్తుతం 94 లక్షలకు చేరారు. త్వరలో అమలయ్యే ఐటీఐఆర్ ప్రాజెక్టు వల్ల దాదాపు మరో కోటిమంది దాకా నగరానికి వచ్చే అవకాశమున్నందున 2050 అవసరాల కనుగుణంగా సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం సూచించారు. ఐటీ కంపెనీలను ఆకట్టుకోవాలంటే మెరుగైన సదుపాయాలు ఉండాల్సి ఉన్నందున ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా సూచించారు. హైటెక్‌సిటీ అయినప్పటికీ సీవరేజి లైన్లు లేకపోవడాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం పనితీరు, డీజిల్ చౌర్యం వంటి అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. - మూసీ ఒకప్పుడు ఎంతో సుందరంగా ఉండేదంటూ.. ప్రస్తుతానికి చెత్తాచెదారాలు లేకుండాైనె నా తగు చర్యలు తీసుకోవాలనడంతో అధికారులు అందుకు సిద్ధమవుతున్నారు. - సమావేశంలో మంత్రులు, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ , హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్, జలమండలి ఎండీ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి ప్రాజెక్టులకునిధుల కొరత రానీయం నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాల పూర్తికి నిధుల కొరత రానీయబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గ్రేటర్ తాగునీటి అవసరాలు 2050 సంవత్సరం నాటికి ఎలా ఉండబోతాయో ఇప్పటి నుంచే సమగ్ర అంచనాలు సిద్ధం చేసుకోవాలని, అందుకు పూర్తిచేయాల్సిన ప్రాజెక్టుల అంచనాలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. నగరంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సరఫరాలో అంతరాయంలేకుండా చూసేందుకు అధికారులు, సిబ్బంది సదా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.