స్లమ్ ఫ్రీ సిటీగా కరీంనగర్
మురికివాడలు లేని నగరంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. 23న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో నగర రూపురేఖలు మార్చేలా రూ.100 కోట్ల నిధులు రాబట్టుకునేందుకు అధికారులు, కార్పొరేషన్ పాలకవర్గం అంచనాలు రూపొందించారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, జేసీ పౌసుమి బసు, ఎంపీ వినోద్‌కుమార్, మేయర్ రవీందర్‌సింగ్‌లు సోమవారం నగరంలోని మురికివాడల్లో పర్యటించి, ప్రజలతో ముచ్చటించారు.
- రాంనగర్/కరీంనగర్
రాంనగర్ : ముంబాయి, హైదరాబాద్‌లాంటి మహానగరాల్లోనే అపార్ట్‌మెంట్ కల్చర్ సహజంగా మారిందని, దానిని అనుసరించి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పేదింటి వారి కలలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కరీంనగర్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా మార్చడానికి అన్ని రకాల ప్రణాళికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి పర్యటించనున్న 10వ డివిజన్‌లోని పలు మురికివాడల కానీలను ఎంపీ సోమవారం పరిశీలించారు.
ఇరుకు గుడిసెలలో ఉన్న వారికి రెండు బెడ్‌రూమ్స్, హాల్, కిచెన్ వంటి సదుపాయాలతో ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేస్తుందన్న హామీకి కట్టుబడి సీఎం పర్యటనకు రంగం సిద్ధమైందన్నారు. దాదాపు రూ.100 కోట్లతో స్లమ్ ఏరియాలలో ఇంటి నిర్మాణాలు, డ్రెరుునేజీలు, పార్క్‌లు, అర్బన్ హెల్త్ సెంటర్ వ ంటి అనేక సౌకర్యాలను అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు చే స్తున్నట్లు చెప్పారు. సీఎం చేస్తున్న స్లమ్ ఫ్రీ సిటీస్‌కు కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవడానికి కృషి చేస్తామని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక అనేక మంది కార్మికులు కరీంనగర్‌కు 30 ఏళ్ల క్రితం వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. అలాంటి వారికి భద్రత కల్పించాలనే కోణంలో సీఎం స్లమ్ ఏరియాలో పక్కా (జీ+1 )ఇంటి నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఇంటి స్థలాలు కేవలం 30 గజాలు నుంచి 50 గజాల వరకే ఉన్నాయని, వాటిలో రెండు బెడ్‌రూమ్స్, హాల్, కిచెన్ నిర్మాణాలకు స్థలం సరిపోదని, అందుకే అన్ని ఇళ్ల స్థలాలు మిళితం చేసి ఇంటిని నిర్మాణాలు చేపడతామని అన్నారు.
సొంత భ వనంలో ఉండాలన్న కోణంలో ప్రజలు మాట్లాడిన వారి గాడిలో పెట్టేందుకు ఎంపీ స్థానిక, ఇతర రాష్ట్రాల్లో ఉన్న అపార్ట్‌మెంట్ కల్చర్‌ను వివరించారు. ప్రభుత్వ తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రజలకు వివరిస్తే వారికి అర్థమైందని, అసలు మా లీడ ర్లకే అర్థం కావడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులపై ఛలోక్తులు విసిరారు. మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ కేవీ.రమణాచారి, రెవెన్యూ ఆఫీసర్ మక్సూద్ మీర్జా, కార్పొరేటర్లు, నాయకులు శ్రీదేవిశ్రీనివాస్, సునీల్‌రావు, ఎడ్ల అశోక్, రవీందర్, ఓరుగంటి ఆనంద్ పాల్గొన్నారు.
మురికివాడల అభివృద్ధికి కృషి కలెక్టర్ నీతుకుమారిప్రసాద్
కరీంనగర్ : మురికివాడల్లో అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ అన్నారు. నగరంలోని రాజీవ్‌నగర్, గోదాంగడ్డలోని మురికివాడలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మురికివాడల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోం దని తెలిపారు. గతంలో మురికివాడల్లో పేదలకు ఇచ్చిన స్థలాల్లో గృహాలు నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. మేయర్ రవీందర్‌సింగ్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, కార్పొరేషన్ కమిషనర్ రమణాచారి, ఆర్డీవో చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, తహశీల్దార్ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.