
గ్రేటర్ కొత్త నంబర్ 040 -21 11 11 11
- సమస్యల పరిష్కారానికి సరికొత్త ఏర్పాటు
- డయల్ చేయడంతోనే రికార్డు కానున్న ఫిర్యాదు
- పరిష్కారమైన సమాచారం ఎస్‌ఎంఎస్ ద్వారా వెల్లడి
- సాక్షి ‘ఫోన్ ఇన్’లో కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రకటన
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీకి సంబంధించి ప్రజలెదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు మరో కొత్త నెంబరును జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. 24 గంటలూ పని చేసే ఈ నెంబరు (040-21111111) ద్వారా ప్రజలు తాము నిత్యం ఎదుర్కొం టున్న పారిశుధ్యం, చెత్త తరలింపు, టౌన్‌ప్లానింగ్, దోమలు.. ఇతరత్రా ఏ సమస్యపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ అందుబాటులోకి తెచ్చిన ఈ నెంబరు ద్వారా వెళ్లే ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో రికార్డు కావడమే కాకుండా ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది. పరిష్కారమయ్యాక ఆ సమాచారమూ తెలుస్తుంది. ఇదే పనివిధానంతో ఇప్పటికే ఒక నెంబరు 155304 అందుబాటులో ఉన్నప్పటికీ..
దానిని ప్రజలు గుర్తుంచుకోవడం కష్టంగా ఉన్నందున తేలిగ్గా గుర్తుండిపోయే కొత్త నెంబరు 21 11 11 11ను అందుబాటులోకి తెచ్చినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలి పారు. ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా పనిచేస్తున్న ఁసాక్షిరూ. ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కమిషనర్‌తో ఁఫోన్ ఇన్‌రూ. కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందిస్తూ కమిషనర్ ఈ విషయం వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ తగు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కొత్తనెంబరు పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. కొత్త నెంబరుతోపాటు పాత నెంబరు కూడా పనిచేస్తుందని ప్రజలు ఈ సదుపాయాల్ని వినియోగించుకోవాల్సిందిగా కమిషనర్ సూచించారు.
అనూహ్య స్పందన
పారిశుధ్యం, పచ్చదనం కార్యక్రమాలపై ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించిన ఫోన్ ఇన్‌కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఫిర్యాదులతోపాటు ప్రజలు సమస్యల పరిష్కారానికి త మవంతు సూచనలు కూడా అందజేశారు. ఇంటి నిర్మాణానికి అనుమతించేటప్పుడే కొన్ని మొక్కలైనా పెంచేలా నిబంధనను అమలు చేయాలని, చెత్తడబ్బాలు తడి, పొడివి వేర్వేరుగా ఏర్పాటుచేస్తే మేలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. పాడైపోయిన చెత్తడబ్బాల నుంచి వ్యర్థాలు రోడ్లపై పడుతుండటాన్నీ దృష్టికి తెచ్చారు. చెరువుల్ని మృతకళేబరాలతో నింపుతున్న వైనాన్నీ వెలుగులోకి తెచ్చారు.
పార్కు స్థలాలు కబ్జా కాకుండా తగుచర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఎంతో ఉత్సాహంతో ఫిర్యాదుల్ని కమిషనర్ దృష్టికి తెచ్చేందుకు పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఏయే ప్రాంతంలో పారిశుధ్య బాధ్యతలు ఎవరివో ప్రజలందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా జవాబుదారీ తనం పెరుగుతుందన్నారు. అంతేకాదు.. పని జరిగినట్లు స్థానికులు ధ్రువీకరిస్తేనే వారికి వేతనాలందజేస్తామని చెప్పారు. రాబోయే రెండు మూడేళ్లలో నగరమంతా భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు.
తొలి దశలో రూ. 300 కోట్లతో శివారు ప్రాంతాల్లో ఈ పనుల చేపడతామన్నారు. శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. దశలవారీగా నగరమంతా ఈ సదుపాయాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఫోన్ ఇన్ సందర్భంగా కమిషనర్‌తోపాటు ఁఆరోగ్యం-పారిశుధ్యంరూ. అడిషనల్ కమిషనర్ ఎన్.రవికిరణ్, జీవవైవిధ్య విభాగం అడిషనల్ కమిషనర్ చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఫిర్యాదుల్ని నోట్ చేసుకున్నారు. పరిష్కార చర్యల్లోకి దిగారు.