బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ యువకున్ని భవానీనగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిహార్ రాష్ట్రానికి చెందిన సాబ్రీ (24) గత కొన్ని నెలలుగా తలాబ్‌కట్టాలో నివాసముంటున్నాడు. ఈ నెల 13వ తేదీన స్థానికంగా ఉండే బాలిక (5)తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాబ్రీని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.