రోగితో అసభ్య ప్రవర్తన.. వైద్యుడికి రిమాండ్ | the physician remand beu to Indecent behavior with the patient | Sakshi
Sakshi News home page

రోగితో అసభ్య ప్రవర్తన.. వైద్యుడికి రిమాండ్

Published Tue, Mar 15 2016 7:27 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

the physician remand beu to Indecent behavior with the patient

రోగితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వైద్యుడ్ని మొఘల్‌పురా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై మహ్మద్ ఇద్రీస్ అలీ తెలిపిన వివరాల ప్రకారం... మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన డాక్టర్ వెంకటేశ్ (27) మొఘల్‌పురా స్విమ్మింగ్‌పూల్ సమీపంలోని అల్ఫా ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. కాగా ఆసుపత్రిలో కడుపునొప్పితో చికిత్స పొందుతున్న తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళ(30)తో ఈనెల 13న వెంకటేశ్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్‌ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement