
వ్యభిచారం పేరుతో టోకరా ఇచ్చిన మహిళ
హైదరాబాద్: స్వచ్ఛంద సంస్థ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ మహిళతో పాటు ఇద్దరు యువకులను రెయిన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.10 వేల నగదు, రూ. 40 వేల విలువ చేసే రెండు ఫోన్లు స్వాధీ నం చేసుకున్నారు. ఎస్సై గోవింద్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-బి ప్రాంతానికి చెందిన మోయినా నయిదా (26) పది రోజుల క్రితం తవ్వాకల్ ఓల్డేజ్ హోమ్ పేరుతో నకిలీ ఎన్‌జీఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఎన్‌జీఓ పేరుతో జనాన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజాలని పథకం వేసింది.
వ్యభిచారం చేస్తానని వెళ్లి...
యాకుత్‌పురా బాగ్‌హే జహేరా ప్రాంతానికి చెందిన సబా వ్యభిచారం చేస్తోంది. ఈమె ఇంటికి ఈనెల 28న నయిదా వెళ్లి.. తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, వ్యభిచారం చేస్తానని, కస్టమర్లు ఉంటే చెప్పాలని కోరింది. దీంతో శుక్రవారం సబా.. జహీర్ అనే విటుడిని తన ఇంటికి పిలిపించి నయిదాకు సమాచారం అందించింది. ముందే వేసుకున్న పథకం లో భాగంగా తన సోదరుడు సోహెల్‌తో పాటు మరి కొందరిని తీసుకొని బాగ్‌హే జహేరా ప్రాంతానికి వెళ్లింది. మిగతా వారు బయట ఉండగా సబా ఇంట్లోకి నయి దా వెళ్లింది. విటుడిని గదిలో పెట్టి తలుపులు పెట్టింది. అనంతరం సబా ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని కేకలు వేసింది.
అప్పటికే ఆ ఇంటి పరిసరాల్లో ఉన్న నయిదా సోదరుడు సోహెల్ మరికొందరు అక్కడికి చేరుకున్నారు. తాను స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలినని, నీవు వ్యభిచారం చేస్తున్నావని తెలిసి పోలీసులకు పట్టించేందుకు వచ్చామని బెదిరించింది. విటుడు జహీర్ వద్ద రూ. 10 వేలు, రూ. 20 విలువ చేసే సెల్‌ఫోన్‌తో పాటు సబా వద్దనున్న బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ను తీసుకుంది. తమకు మరో రూ. 50 వేలు ఇవ్వాలని లేకపోతే కేసు నమోదు చేయిస్తానని బెదిరించింది. దీంతో బాధితురాలు సబా జరిగిన సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 448, 506, 384, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమో దు చేశారు. మోయినా నయిదాతో పాటు సోహేల్, జహీర్‌లను అరెస్ట్ చేశారు. కాగా, నయిదా మాజీ రౌడీషీటర్ అక్బర్ కూతురని, జనాన్ని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజేం దుకు నకిలీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిందని పోలీసులు తెలిపారు.