తల్లీ, ఇద్దరు పిల్లల అదృశ్యం కలకలం! | three missing in shamshabad since two days | Sakshi

తల్లీ, ఇద్దరు పిల్లల అదృశ్యం కలకలం!

Published Fri, Dec 30 2016 10:30 AM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

three missing in shamshabad since two days

శంషాబాద్: ఓ తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు అదృశ్యం ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో స్థానికంగా కలకలం రేపింది. గత రెండు రోజుల నుంచి తన భార్య, పిల్లలు కనిపించడం లేదంటూ ఆమె భర్త శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. రెండు రోజుల కింద తన భార్య వినోద.. పిల్లలు ప్రవళిక, నర్సింహాలను తీసుకుని ఆస్పత్రికని వెళ్లింది. అయితే వారు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తనకు తెలిసినవారి ఇళ్లల్లో, చుట్టుపక్కల వెతికాడు. ఇక లాభం లేదనుకుని శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్య, ఇద్దరు పిల్లలు గత రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement