మధ్యాహ్నం 3 గంటలకు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం వెల్లడి కానున్నాయి. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయ ఆవరణలో మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య ఫలితాలు విడుదల చేస్తారు. మే నెలలో జరిగిన ఇంటర్మీడియెట్ జనర ల్, వొకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు అంచనా. ఈ ఫలితాలను విద్యార్థులు www. sakshieducation.com, tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in, http://examresults.ts.nic.in వెబ్‌సైట్‌లలో పొందవచ్చు.
అలాగే పరిష్కారం కాల్ సెంటర్‌కు (1100 నంబర్‌కు) బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇతర ల్యాండ్‌లైన్/మొబైల్ నుంచి 18004251110 నంబర్‌కు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఈసేవా, మీసేవా, రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లోనూ పొందవచ్చు. కళాశాలల ప్రిన్సిపల్స్ తమ కాలేజీల వారీగా ఫలితాలను యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి జ్http://bietelangana. cgg.gov.inలో పొందవచ్చు.
నేడు ఇంటర్ ‘సప్లిమెంటరీ’ ఫలితాలు
Published Thu, Jun 23 2016 3:23 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
Advertisement