సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు సచివాలయానికి వెళ్లిన నేతలను అరెస్ట్ చేయడానికి నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, లోక్‌సత్తా ప్రకటించాయి. సీఎంను కలుసుకోవడానికి వెళితే అరెస్ట్ చేస్తారా, ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? అని ఒక ప్రకటనలో నిలదీశాయి. మున్సిపల్, పంచాయతీ కార్మికులు వారి జీతభత్యాల పెంపుదల కోసం సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించాయి.
సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో వివిధ పార్టీల నేతలు ఆయనను కలిసేందుకు సచివాలయానికి వెళ్లారన్నారు. కానీ, అపాయింట్‌మెంట్ లేదంటూ పోలీసులు అరెస్ట్ చేయడం సీఎం కేసీఆర్ దురంహకారానికి నిదర్శనమని సీపీఐనేత చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యలను పక్కనపెట్టి కార్పొరేట్ సేవకు తహతహలాడుతున్న సీఎం కేసీఆర్ వైఖరిని ఖండిస్తున్నామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నేడు లెఫ్ట్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, లోక్‌సత్తా నిరసనలు
Published Sat, Aug 8 2015 2:59 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement