పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) చేపట్టిన ఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గురువారం ప్రారంభమైంది.
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) చేపట్టిన ఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గురువారం ప్రారంభమైంది. గురువారం ఒకటో ర్యాంకు నుంచి 4 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు వెరిఫికేషన్ చేపట్టగా.. 3,368 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారని ఈసెట్ ప్రవేశా ల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. శుక్రవారం 4,001వ ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్ చేపడతామన్నారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.