రేవంత్‌రెడ్డిని తరిమికొడతాం
వనస్థలిపురం: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్, మంత్రులపై ఆరోపణలు చేస్తే తెలంగాణ నుంచి తరిమికొడతామని టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. ప్రజలు ఆయనకు గుండు గీసి సున్నం బొట్లు పెట్టి గాడిదపై ఊరేగిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ నాయకుడు మాధవరం నర్సింహారావు ఆధ్వర్యంలో గురువారం వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లో చేపట్టిన బైక్ ర్యాలీని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, నాయకులు పుటం పురుషోత్తంరావు, జగన్‌గౌడ్, మహేందర్, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
పోస్టర్‌కు చెప్పుల దండ
అమీర్‌పేట: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం బల్కంపేటలో టీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. రేవంత్ చిత్రపటానికి చెప్పుల దండవేసి చెప్పులతో కొట్టారు. మాజీ కార్పోరేటర్ ఎన్.శేషుకుమారి, డివిజన్ అధ్యక్షుడు బుట్టిరాజశేఖర్, గోదాస్‌కిరణ్ హేమలత, దుర్గేశ్, రాణీకౌర్, ఎం.హనుమంత్‌రావు, ఉమానాథ్‌గౌడ్, షంఖు, షఫీ, శేఖర్ పాల్గొన్నారు.